Home PANCHANGAM Daily Horoscope 02/10/2021 :

Daily Horoscope 02/10/2021 :

0
Daily Horoscope 02/10/2021 :

Daily Horoscope 02/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

02, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ ఏకాదశి
వర్ష ఋతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 02/10/2021
Daily Horoscope 02/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాలికను సిద్ధం చేయండి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయం పఠించడం మంచిది. Daily Horoscope 02/10/2021

 వృషభం

ఈరోజు
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

 మిధునం

ఈరోజు
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

 కర్కాటకం

ఈరోజు
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలున్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.

 సింహం

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.

 కన్య

ఈరోజు
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

 తుల

ఈరోజు
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు. Daily Horoscope 02/10/2021

 వృశ్చికం

ఈరోజు
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

 ధనుస్సు

ఈరోజు
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

 మకరం

ఈరోజు
చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. శ్రీ రామ నామాన్ని జపించడం శుభప్రదం.

 కుంభం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.

 మీనం

ఈరోజు
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. స్థిరమైన బుద్ధితో మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది. Daily Horoscope 02/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, అక్టోబర్ 2, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి రా7.44 తదుపరి ద్వాదశి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఆశ్రేష రా1.36 తదుపరి మఖ
యోగం:సిద్ధం సా4.46 తదుపరి సాధ్యం
కరణం:బవ ఉ7.26 తదుపరి బాలువరా7.44 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం:మ1.53 – 3.33
దుర్ముహూర్తం:ఉ5.54 – 7.29
అమృతకాలం:రా11.55 – 1.36
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.48
సర్వ ఏకాదశి

check Coconut benefits:

Leave a Reply

%d bloggers like this: