Daily Horoscope 01/10/2021 :

0
59
Daily Horoscope 16/10/2021
Daily Horoscope 16/10/2021

Daily Horoscope 01/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

01, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ దశమి
వర్ష ఋతువు
దక్షణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 01/10/2021
Daily Horoscope 01/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం. Daily Horoscope 01/10/2021

 వృషభం

ఈరోజు
ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

 మిధునం

ఈరోజు
మిశ్రమకాలం. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

 కర్కాటకం

ఈరోజు
మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.

సింహం

ఈరోజు
స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినప్పటికీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. దైవ ధ్యానం మరవద్దు

 కన్య

ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. Daily Horoscope 01/10/2021

 తుల

ఈరోజు
ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనశ్శాంతిని తగ్గించే ఘటనలు చోటుచేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర సందర్శనం ప్రశాంతత కోసం శుభప్రదం.

 వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు. విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగండి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం

ధనుస్సు

ఈరోజు
అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్పలితాలు సిద్ధిస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీ రామ దర్శనం మరింత మేలు చేస్తుంది.

 మకరం

ఈరోజు
అనుకూలమైన సమయం. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

 కుంభం

ఈరోజు
దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మహాలక్ష్మి దర్శనం శుభకరం.

 మీనం

ఈరోజు
కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం Daily Horoscope 01/10/2021

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః 卐
శుక్రవారం, అక్టోబర్ 1, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం.
తిధి : దశమి రా7.08వరకు
తదుపరి ఏకాదశి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : పుష్యమి రా12.31వరకు
తదుపరి ఆశ్రేష
యోగం : శివం సా5.20
తదుపరి సాధ్యం
కరణం: వణిజ ఉ6.37
తదుపరి విష్ఠి రా7.08
ఆ తదుపరి బవ
వర్జ్యం : ఉ7.28 – 9.10
దుర్ముహూర్తం : ఉ8.18 – 9.07 &
మ12.08 – 1.08
అమృతకాలం: సా5.41 – 7.23
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి: కన్య || చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.54 || సూర్యాస్తమయం: 5.48

check Daily Horoscope 27/09/2021

Leave a Reply