Home PANCHANGAM Daily Horoscope 29/09/2021 :

Daily Horoscope 29/09/2021 :

0

Daily Horoscope 29/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

29, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ అష్టమి
వర్ష ఋతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 29/09/2021
Daily Horoscope 29/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి. Daily Horoscope 29/09/2021

 వృషభం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం పఠించాలి.

 మిధునం

ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

 సింహం

ఈరోజు
సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్నిఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. Daily Horoscope 29/09/2021

 కన్య

ఈరోజు
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

 తుల

ఈరోజు
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయకండి. విష్ణు నామాన్ని స్మరించాలి.

 వృశ్చికం

ఈరోజు
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ధనుస్సు

ఈరోజు
ఉత్తమ కాలం. అభివృద్ధి కోసం కాలాన్ని వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబసౌఖ్యం కలదు. శని ధ్యాన శ్లోకం పఠనం శుభప్రదం.

 మకరం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.

 కుంభం

ఈరోజు
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. లక్ష్మీ అష్టకాన్ని చదవాలి.

 మీనం

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. Daily Horoscope 29/09/2021 ఇష్టదైవారాధన శుభప్రదం.

Panchangam

శుభమస్తు పంచాంగం

తేది : 29, సెప్టెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(నిన్న మధ్యాహ్నం 2 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 35 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర
(నిన్న రాత్రి 6 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 58 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు లేదు
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 53 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మిథునము

check Daily Horoscope 25/09/2021 :

Leave a Reply

%d bloggers like this: