Daily Horoscope 28/09/2021 :

0
80
Daily Horoscope 16/10/2021
Daily Horoscope 16/10/2021

Daily Horoscope 28/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

28, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ సప్తమి
వర్ష ఋతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 28/09/2021
Daily Horoscope 28/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ఒక వ్యవహారంలో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. Daily Horoscope 28/09/2021

వృషభం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి.

 మిధునం

ఈరోజు
ఉత్సాహంగా ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.

 కర్కాటకం

ఈరోజు
చేపట్టే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.

 సింహం

ఈరోజు
మీరు పనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

 కన్య

ఈరోజు
పట్టుదలతో పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. చంద్రధ్యానం శ్రేయోదాయకం. Daily Horoscope 28/09/2021

 తుల

ఈరోజు
మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. తోటి వారి సహాయంతో కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి. శివ అష్టోత్తరం పఠిస్తే మంచిది.

 వృశ్చికం

ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్‌ చాలీసా పఠించడం మంచిది.

 ధనుస్సు

ఈరోజు
ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

మకరం

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. తొందరపాటు చర్యలు వద్దు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.

 కుంభం

ఈరోజు
పెద్దల సలహాలు శక్తిని చేకూరుస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శనిశ్లోకం చదవాలి.

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. బుద్ధిచాంచల్యం రాకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 28/09/2021

Panchangam

ఓం శ్రీగురుభ్యోనమః
శుభమస్తు

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
తేది : 28, సెప్టెంబరు 2021
సంవత్సరం : స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సరం
ఆయనము : దక్షిణాయనము
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షా కాలం
మాసం : భాద్రపద మాసము
పక్షం : కృష్ణ పక్షం
వారము : భౌమ వాసరే ( మంగళ వారము )
తిథి : సప్తమి
( ఈరోజు రాత్రి 06 గం ౹౹ 14 ని ౹౹ వరకు )
నక్షత్రం : మృగశిర
( ఈరోజు రాత్రి 08 గం ౹౹ 41 ని ౹౹ వరకు )
యోగము : వ్యతిపాత
( ఈరోజు సాయంత్రం 05 గం ౹౹ 47 ని ౹౹ వరకు )
కరణము : బవ
( ఈరోజు రాత్రి 06 గం ౹౹ 14 ని ౹౹ వరకు )
వర్జ్యం
(ఈరోజు రాత్రి తెల్లవారుజామున 06 గం ౹౹ 01 ని ౹౹ లగాయతు )
అమృత ఘడియలు :
(ఈరోజు పగలు 10 గం ౹౹ 47 ని ౹౹ లగాయతు 12 గం ౹౹ 35 ని ౹౹ వరకు )
దుర్ముహూర్తం :
(ఈరోజు పగలు 08 గం ౹౹ 32 ని ౹౹ లగాయతు 09 గం ౹౹ 20 ని ౹౹ వరకు )
మరల
(ఈరోజు రాత్రి 10 గం ౹౹ 54 ని ౹౹ లగాయతు 11 గం ౹౹ 42 ని ౹౹ వరకు )
సూర్యోదయం : ఉదయం 06 గం॥ 09 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 06 గం॥ 04 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : వృషభం
కార్తె : హస్త
శార్దతిధి: సప్తమి

check Daily Horoscope 20/05/2021

Leave a Reply