
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
27, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ షష్టి
వర్ష ఋతువు
దక్షణాయనము ఇందు వాసరే
( సోమ వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒకశుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది. Daily Horoscope 27/09/2021
వృషభం
ఈరోజు
మేలైన ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది
మిధునం
ఈరోజు
మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం.
కర్కాటకం
ఈరోజు
మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.
సింహం
ఈరోజు
సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
కన్య
ఈరోజు
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం. Daily Horoscope 27/09/2021
తుల
ఈరోజు
గ్రహబలం తక్కువగా ఉంది. మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి.
వృశ్చికం
ఈరోజు
పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
ధనుస్సు
ఈరోజు
ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.
మకరం
ఈరోజు
కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో ఊరుకోవడం ఉత్తమం. శివనామాన్ని జరిపించాలి.
కుంభం
ఈరోజు
తోటి వారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధనధాన్యవృద్ధి, ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
మీనం
ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలున్నాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది. Daily Horoscope 27/09/2021
Panchangam
శ్రీ గురుభ్యోనమః
సోమవారం, సెప్టెంబర్ 27,2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠి మ12.43వరకు తదుపరి సప్తమి
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:రోహిణి సా4.05వరకు తదుపరి మృగశిర
యోగం:సిద్ధి సా4.29 తదుపరి వ్యతీపాతం
కరణం:వణిజ మ12.43 తదుపరి విష్ఠి రా1.43 ఆ తదుపరి బవ
వర్జ్యం:ఉ7.12 – 8.58 & రా10.16 – 12.02
దుర్ముహూర్తం:మ12.16 – 1.04 &
మ2.40 – 3.28
అమృతకాలం:మ12.31 – 2.18
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం: 5.53