Home PANCHANGAM Daily Horoscope 25/09/2021 :

Daily Horoscope 25/09/2021 :

0
Daily Horoscope 25/09/2021 :

Daily Horoscope 25/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

25, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ చతుర్థి
వర్ష ఋతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 25/09/2021
Daily Horoscope 25/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం. Daily Horoscope 25/09/2021

 వృషభం

ఈరోజు
కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. మనోధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించడం మంచిది.

 మిధునం

ఈరోజు
కుటుంబ సౌఖ్యం కలదు. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామ స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
లాభదాయకమైన కాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. విద్యావినోదసుఖం ఉంది. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

 సింహం

ఈరోజు
ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని రానీయకండి. దుర్గాస్తుతి పఠిస్తే బాగుంటుంది.

 కన్య

ఈరోజు
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది. Daily Horoscope 25/09/2021

 తుల

ఈరోజు
అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం

 వృశ్చికం

ఈరోజు
గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ధనుస్సు

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

 మకరం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగడానికి లక్ష్మీధ్యానం శుభప్రదం.

 కుంభం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం.

 మీనం

ఈరోజు
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి. Daily Horoscope 25/09/2021

Panchangam

తేది : 25, సెప్టెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న ఉదయం 6 గం॥ 59 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 41 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(నిన్న ఉదయం 8 గం॥ 41 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు
వర్జ్యం : ఈరోజు రాత్రి 12 గం ” 13 ని ” నుంచి రాత్రి 1 గం ” 59 ని ” వరకు
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 5 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 53 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 54 ని॥ లకు

check Daily Horoscope 05/09/2021 :

Leave a Reply

%d bloggers like this: