Home PANCHANGAM Daily Horoscope 22/09/2021 :

Daily Horoscope 22/09/2021 :

0
Daily Horoscope 22/09/2021 :

Daily Horoscope 22/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

22, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ ద్వితీయ
వర్ష ఋతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధవారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 22/09/2021
Daily Horoscope 22/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది. Daily Horoscope 22/09/2021

 వృషభం

ఈరోజు
గట్టి సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది.

 మిధునం

ఈరోజు
మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిరనిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.

కర్కాటకం

ఈరోజు
వృత్తి,వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిఇస్తాయి. భోజనసౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

 సింహం

ఈరోజు
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్థ,వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

 కన్య

ఈరోజు
ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి. Daily Horoscope 22/09/2021

తుల

ఈరోజు
కొన్ని విషయాలలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నవమంలో చంద్రస్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం. చంద్ర ధ్యానశ్లోకం చదివితే మంచిది.

 వృశ్చికం

ఈరోజు
శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

 ధనుస్సు

ఈరోజు
అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులలో విజయం కోసం గోవిందనామాలు చదవాలి.

 మకరం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శివనామాన్ని జపించాలి.

 కుంభం

ఈరోజు
ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని ఇస్తుంది.

 మీనం

ఈరోజు
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి దర్శనం శుభాలను చేకూరుస్తుంది. Daily Horoscope 22/09/2021

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
బుధవారం, సెప్టెంబర్ 22, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం.
తిధి : విదియ పూర్తి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: రేవతి పూర్తి
యోగం: వృద్ధి మ3.17
తదుపరి ధృవం
కరణం: తైతుల సా5.30
తదుపరి గరజి
వర్జ్యం : సా6.15 – 7.57
దుర్ముహూర్తం : ఉ11.29 – 12.18
అమృతకాలం: తె4.26వరకు
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: కన్య || చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.52 || సూర్యాస్తమయం: 5.57

check Maghapuranam-19th chapter

Leave a Reply

%d bloggers like this: