Daily Horoscope 15/09/2021 :

0
75
Daily Horoscope 23/10/2021
Daily Horoscope 23/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
శుక్ల నవమి
వర్ష ఋతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 15/09/2021
Daily Horoscope 15/09/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శివనామాన్ని జపించండి. Daily Horoscope 15/09/2021

వృషభం

ఈరోజు
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

మిధునం

ఈరోజు
దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్దిబలం బాగుంటుంది. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్నిదర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

 కర్కాటకం

ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 సింహం

ఈరోజు
మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

 కన్య

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. Daily Horoscope 15/09/2021

 తుల

ఈరోజు
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

 వృశ్చికం

ఈరోజు
శుభ ఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

మకరం

ఈరోజు
ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవీ యోగం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

 కుంభం

ఈరోజు
మీ ఆలోచనాధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

 మీనం

ఈరోజు
మనస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. Daily Horoscope 15/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, సెప్టెంబర్ 15, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి: నవమి మ12.39 తదుపరి దశమి
వారం: బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల ఉ8.18 తదుపరి
యోగం:ఆయుష్మాన్ ఉ6.37 తదుపరి సౌభాగ్యం తె3.46
కరణం:కౌలువ మ12.39 తదుపరి తైతుల రా11.33 ఆ తదుపరి గరజి
వర్జ్యం:ఉ6.48 – 8.18 &
సా5.18 – 6.48
దుర్ముహూర్తం:ఉ11.32 – 12.20
అమృతకాలం:రా2.19 – 3.49*
రాహుకాలం: మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.51
సూర్యాస్తమయం:6.02

Leave a Reply