Daily Horoscope 14/09/2021

0
83
Daily Horoscope 16/10/2021
Daily Horoscope 16/10/2021

Daily Horoscope 14/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
శుక్ల నవమి
వర్ష ఋతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 14/09/2021
Daily Horoscope 14/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది. Daily Horoscope 14/09/2021

 వృషభం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

 మిధునం

ఈరోజు
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం పఠించాలి.

 కర్కాటకం

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో లాభం పొందుతారు. లక్ష్మీ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

 సింహం

ఈరోజు
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం పఠించడం మంచిది.

 కన్య

ఈరోజు
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.

 తుల

ఈరోజు
చేపట్టే పనులలో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి. Daily Horoscope 14/09/2021

 వృశ్చికం

ఈరోజు
శుభకాలం. విశేషమైన ప్రగతి సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని కలిగిస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం మంచిది.

 మకరం

ఈరోజు
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహస్తోత్రం చదివితే బాగుంటుంది.

 కుంభం

ఈరోజు
అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.

 మీనం

ఈరోజు
ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి. Daily Horoscope 14/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, సెప్టెంబర్ 14,2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి మ2.58 తదుపరి నవమి
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ ఉ9.53 తదుపరి మూల
యోగం:ప్రీతి ఉ9.39 తదుపరి ఆయుష్మాన్
కరణం:బవ మ2.58 తదుపరి బాలువ రా2.24 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం: సా5.20 – 6.50
దుర్ముహూర్తం:ఉ8.16 – 9.05 &
రా10.45 – 11.32
అమృతకాలం: రా2.18 – 3.47*
రాహుకాలం :మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం: 6.03

check Daily Horoscope 12/09/2021 

Leave a Reply