Daily Horoscope 13/09/2021 :

0
74
Daily Horoscope 18/10/2021
Daily Horoscope 18/10/2021

Daily Horoscope 13/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

13, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
శుక్ల సప్తమి
వర్ష ఋతువు
దక్షణాయనము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 13/09/2021
Daily Horoscope 13/09/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. Daily Horoscope 13/09/2021

 వృషభం

ఈరోజు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. చెడ్డవాళ్లు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

మిధునం

ఈరోజు
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
హుషారుగా ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దేహజాడ్యం ఉంది. చంద్ర శ్లోకం చదవాలి.

 సింహం

ఈరోజు
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్చరిత పారాయణ శుభాన్నిస్తుంది.

 కన్య

ఈరోజు
మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది. Daily Horoscope 13/09/2021

 తుల

ఈరోజు
మొదలు పెట్టిన పనుల్లో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. పట్టుదల వదలకండి. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు.

 వృశ్చికం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. బాగా కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. బంధువుల అండదండలుంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
శ్రమతో కూడిన ఫలాలున్నాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. సూర్యస్తోత్రము చదివితే మంచిది.

 మకరం

ఈరోజు
మంచి కాలం. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగిస్తే గొప్ప ఫలితాలను అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

కుంభం

ఈరోజు
మనోధైర్యంతో చేసే పనులు మంచినిస్తాయి. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తోంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుర్గా దేవి సందర్శనం శుభప్రదం.

 మీనం

ఈరోజు
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. Daily Horoscope 13/09/2021

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, సెప్టెంబర్ 13, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిధి : సప్తమి సా5.23 వరకు
తదుపరి అష్టమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: అనూరాధ ఉ11.34
తదుపరి జ్యేష్ఠ
యోగం: విష్కంభం మ12.45
తదుపరి ప్రీతి
కరణం: గరజి ఉ6.36
తదుపరి వణిజ సా5.23
ఆ తదుపరి విష్ఠి తె4.11
వర్జ్యం : సా4.46 – 6.15
దుర్ముహూర్తం : మ12.20 – 1.09 &
మ2.47 – 3.36
అమృతకాలం: రా1.42 – 3.11
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం: ఉ10.30 – 12.00
సూర్యరాశి: సింహం || చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.50 || సూర్యాస్తమయం: 6.03

check Daily Horoscope 01/09/2021 

Leave a Reply