Daily Horoscope 12/09/2021 :

0
86
Daily Horoscope 18/10/2021
Daily Horoscope 18/10/2021

Daily Horoscope 12/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

12, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
శుక్ల షష్ఠి
వర్ష ఋతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 12/09/2021
Daily Horoscope 12/09/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
ముఖ్య విషయాల్లో ఆత్మస్థైర్యం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

 వృషభం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వరుని దర్శనం శుభప్రదం.

 మిధునం

ఈరోజు
చక్కటి శుభకాలం నడుస్తోంది. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

 కర్కాటకం

ఈరోజు
అనుకూలమైన సమయం. మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

సింహం

ఈరోజు
శుభకాలం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి ధ్యానం శుభప్రదం.

 కన్య

ఈరోజు
ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. లక్ష్మీ గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

తుల

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

వృశ్చికం

ఈరోజు
లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ ఫలితాలను ఇస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

 మకరం

ఈరోజు
అనుకున్నపని నెరవేరుతుంది. సంతోషంగా గడుపుతారు. విందు,వినోద సుఖాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

కుంభం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్యహృదయం పఠించాలి.

 మీనం

ఈరోజు
శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, సెప్టెంబర్ 12, 2021
శ్రీ ప్లవ నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ,భాద్రపద మాసే, శుక్ల పక్షే, షష్ఠ్యాం తిధౌ (షష్ఠి రా7.48వరకు),

భానువాసరే

నక్షత్రం: విశాఖ మ1.12 తదుపరి అనూరాధ
యోగం: వైధృతి మ3.49 తదుపరి విష్కంభం
కరణం: కౌలువ ఉ8.59, తైతుల రా7.48
తదుపరి గరజి
వర్జ్యం : సా4.55 – 6.25
దుర్ముహూర్తం : సా4.26 – 5.15
అమృతకాలం: ఉ6.28వకు & రా1.52 – 3.21
రాహుకాలం : సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 – 1.30
సూర్యరాశి: సింహం || చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.50 || సూర్యాస్తమయం: 6.04

Leave a Reply