Daily Horoscope 11/09/2021 :

0
116

Daily Horoscope 11/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

11, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
శుక్ల పంచమి
వర్ష ఋతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 11/09/2021
Daily Horoscope 11/09/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన,వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది. Daily Horoscope 11/09/2021

వృషభం

ఈరోజు
కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.

 మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. సంతోషకరమైన కాలం ఉంది. వస్త్ర,ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

సింహం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 కన్య

ఈరోజు
చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. శని ధ్యానం చేయండి. Daily Horoscope 11/09/2021

 తుల

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

 వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

 మకరం

ఈరోజు
అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీవెంకటేశ్వరుని దర్శనం శుభప్రదం.

 కుంభం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్నచిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

 మీనం

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. తోటివారితో వాదోపవాదాలు చేయకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. Daily Horoscope 11/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, సెప్టెంబర్ 11, 2021
శ్రీ ప్లవ నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, పంచమీ తిథి రా10.10వరకు, స్థిరవాసరే
నక్షత్రం:స్వాతి మ2.47 తదుపరి విశాఖ
యోగం:ఐంద్రం సా6.50 తదుపరి వైధృతి
కరణం:బవ ఉ11.17, బాలువ రా10.10 తదుపరి తైతుల
వర్జ్యం:రా8.00 – 9.00
దుర్ముహూర్తం:ఉ5.50 – 7.27
అమృతకాలం:ఉ6.29-8.00 & తె4.58నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం: 6.04
ఋషి పంచమి

check Daily Horoscope 03/09/2021 :

Leave a Reply