Daily Horoscope 07/09/2021 :

0
94
Daily Horoscope 18/10/2021
Daily Horoscope 18/10/2021

Daily Horoscope 07/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

07, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ అమావాస్య
అనంతరం
శుక్ల ప్రతిపత్
వర్ష ఋతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 07/09/2021
Daily Horoscope 07/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది. Daily Horoscope 07/09/2021

వృషభం

ఈరోజు
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.

 మిధునం

ఈరోజు
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

 కర్కాటకం

ఈరోజు
శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

 సింహం

ఈరోజు
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

 కన్య

ఈరోజు
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

 తుల

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవరితోనూ గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం. Daily Horoscope 07/09/2021

 వృశ్చికం

ఈరోజు
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.

ధనుస్సు

ఈరోజు
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం మంచిది.

మకరం

ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 కుంభం

ఈరోజు
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజనంసౌఖ్యం కలదు. లక్ష్మీ ఆరాధన మంచిది.

 మీనం

ఈరోజు
శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 07/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, సెప్టెంబర్ 7, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య ఉ6.31వరకు
తదుపరి భాద్రపద శుక్ల పాడ్యమి తె5.28
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పుబ్బ సా6.35వరకు
యోగం:సిద్ధం ఉ6.56వరకు తదుపరి సాధ్యం తె5.04
కరణం:నాగవం ఉ6.31వ. తదుపరికింస్తుఘ్నం సా5.59వ. బవ తె5.27
వర్జ్యం:రా1.39 – 3.13
దుర్ముహూర్తం:ఉ8.16 – 9.05 &
రా10.47 – 11.34
అమృతకాలం:మ12.11 – 1.47
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09

Leave a Reply