
Daily Horoscope 06/09/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
06, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ చతుర్దశి
వర్ష ఋతువు
దక్షణాయనము ఇందు వాసరే
( సోమ వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
దైవబలం కాపాడుతోంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు. Daily Horoscope 06/09/2021
వృషభం
ఈరోజు
గ్రహబలం అనుకూలంగా లేదు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.
మిధునం
ఈరోజు
శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కర్కాటకం
ఈరోజు
ఉత్సాహంగా పనిచేయాలి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
సింహం
ఈరోజు
అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది. Daily Horoscope 06/09/2021
కన్య
ఈరోజు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
తుల
ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి.లింగాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
వృశ్చికం
ఈరోజు
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
ధనుస్సు
ఈరోజు
పట్టుదలతో పనిచేయండి. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.
మకరం
ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం,విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామనామాన్నిజపించండి.
కుంభం
ఈరోజు
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
మీనం
ఈరోజు
మంచి కాలం. ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 06/09/2021
Panchangam
శ్రీ గురుభ్యోనమః
సోమవారం, సెప్టెంబర్ 6, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్ధశి ఉ7.00వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:మఖ సా6.35వరకు
యోగం:శివం ఉ8.22
కరణం:శకుని ఉ7.00 & తదుపరి చతుష్పాత్ సా6.45
వర్జ్యం:ఉ6.21 – 7.59 &
రా2.35 – 4.11
దుర్ముహూర్తం:మ12.23 – 1.12 & మ2.50 – 3.40
అమృతకాలం:సా4.08 – 5.46
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09
పోలాల అమావాస్య