Daily Horoscope 04/09/2021 :

0
77
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 04/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

04, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ ద్వాదశి
వర్ష ఋతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 04/09/2021
Daily Horoscope 04/09/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం. Daily Horoscope 04/09/2021

 వృషభం

ఈరోజు
మీ పనుల్లో బంధు,మిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 మిధునం

ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కర్కాటకం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.

 సింహం

ఈరోజు
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. చక్కటి శుభఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు సందర్శనం ఉత్తమం.

 కన్య

ఈరోజు
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది. Daily Horoscope 04/09/2021

తుల

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్యనమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

 వృశ్చికం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి.

 ధనుస్సు

ఈరోజు
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

 మకరం

ఈరోజు
బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

 కుంభం

ఈరోజు
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

 మీనం

ఈరోజు
ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. Daily Horoscope 04/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, సెప్టెంబర్ 4, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ6.24 తదుపరి త్రయోదశి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పుష్యమి సా5.09 తదుపరి ఆశ్రేష
యోగం:వరీయాన్ ఉ10.03 తదుపరి పరిఘము
కరణం:తైతుల ఉ6.24 తదుపరి గరజి మ2.21 ఆ తదుపరి వణిజ
వర్జ్యం :లేదు
దుర్ముహూర్తం :ఉ5.49 – 7.26
అమృతకాలం:ఉ10.21 – 12.03
రాహుకాలం: ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.11
శనిత్రయోదశి

check Daily Horoscope 27/08/2021 :

Leave a Reply