Daily Horoscope 03/09/2021 :

0
73
Daily Horoscope 16/10/2021
Daily Horoscope 16/10/2021

Daily Horoscope 03/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

03, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ ఏకాదశి
వర్ష ఋతువు
దక్షణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 03/09/2021
Daily Horoscope 03/09/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
పక్కా ప్రణాళికతో ముందుకు సాగండి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది. Daily Horoscope 03/09/2021

వృషభం

ఈరోజు
కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మానసిక పీడ పెరుగుతుంది. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆంజనేయుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

 మిధునం

ఈరోజు
ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతాస్తుతి మంచిది.

 కర్కాటకం

ఈరోజు
ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

సింహం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం.

 కన్య

ఈరోజు
ఉద్యోగంలో పైఅధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.

 తుల

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. Daily Horoscope 03/09/2021

 వృశ్చికం

ఈరోజు
తోటివారి సహకారంతో పనిచేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

 ధనుస్సు

ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

 మకరం

ఈరోజు
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

 కుంభం

ఈరోజు
శరీర సౌఖ్యం ఉంది. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

 మీనం

ఈరోజు
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీధ్యానం శుభప్రదం. Daily Horoscope 03/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, సెప్టెంబర్ 3, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి: ద్వాదశి పూర్తి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:పునర్వసు మ3.42 తదుపరి పుష్యమి
యోగం:వ్యతీపాతం ఉ10.18 తదుపరి వరీయాన్
కరణం:కౌలువ సా5.51 తదుపరి తైతుల తె5.17
వర్జ్యం:రా12.10 – 1.52
దుర్ముహూర్తం:ఉ8.17 – 9.06 &
మ12.24 – 1.14
అమృతకాలం:మ1.06 – 2.50
రాహుకాలం :ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.11

check Daily Horoscope 03/09/2021

Leave a Reply