Daily Horoscope 01/09/2021 :

0
121

Daily Horoscope 01/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

01, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ దశమి
వర్ష ఋతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 01/09/2021
Daily Horoscope 01/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందూ,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 వృషభం

ఈరోజు
వృత్తి,ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మిధునం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీస్తుతి పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

 సింహం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

 కన్య

ఈరోజు
ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్నివిషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్దతులను అవలంభించడం మంచిది. గోసేవ చేయడం మంచిది.

తుల

ఈరోజు
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

 వృశ్చికం

ఈరోజు
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. తావివ్వరాదు. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.

ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

 మకరం

ఈరోజు
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాలు వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

కుంభం

ఈరోజు
కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

మీనం

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, సెప్టెంబర్ 1, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:దశమి తె3.49(తెల్లవారితే గురువారం)
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మృగశిర ఉ11.32 తదుపరి ఆర్ధ్ర
యోగం:వజ్రం ఉ9.49 తదుపరి సిద్ధి
కరణం:వణిజ మ2.55 తదుపరి విష్ఠి తె3.49
వర్జ్యం :రా8.43. – 10.28
దుర్ముహూర్తం :ఉ11.36 – 12.25
అమృతకాలం:తె2.51 – 4.36
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం: 6.13

check Daily Horoscope 29/08/2021 :

Leave a Reply