Sumati sathakam – సుమతీ శతకం

0
95
Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam - సుమతీ శతకం

Sumati sathakam – సుమతీ శతకం

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుఁగదరా సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! అవసరమునకు పనికిరాని చుట్టము, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినపుడు ముందుకు పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్ట వలెను.

Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam – సుమతీ శతకం

తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపగాఁ
దల దడివి బాస జేఁసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! వేశ్యకు నిలువెత్తు ధనమిచ్చినప్పటికీ నిజాము చెప్పదు. పైగా తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసిననూ వేశ్యను నమ్మరాదు. కల్లలాడి పురుషుని వశపరచుకొనును అని భావం.

Leave a Reply