Sumati sathakam – సుమతీ శతకం

0
87
Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam - సుమతీ శతకం

Sumati sathakam – సుమతీ శతకం

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

తాత్పర్యం: అల్లుని మంచితనము, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదాని యందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులను లోకములో నుండవు.

Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam – సుమతీ శతకం

కోమలి విశ్వాసంబున
బాములతోఁజెలిమి యన్య భామలవలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!

తాత్పర్యం: స్త్రీల యొక్క నమ్మకమును, పాముల యొక్క స్నేహమును, పరస్త్రీల యొక్క మోహమును, వేపచెట్ల యొక్క తియ్యదనమును, రాజుల యొక్క విశ్వాసమును నమ్మరాదు. అవి అసత్యములుగా నిర్ణయించి జీవనము చేయాలి అని భావం.

Leave a Reply