Dasarathi sathakam-ధాశరథీ శతకం

0
33
Dasarathi sathakam-ధాశరథీ శతకం
Dasarathi sathakam-ధాశరథీ శతకం

Dasarathi sathakam-ధాశరథీ శతకం

పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుఁదమ్ము డిరుపక్కియలన్ జానీ తద్విపత్తి సం
తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! పాపములు పొందునపుడును, యుద్ధము, సర్వ భయము, భూత బాధలు, శరీరమందు రోగాదులు మున్నగు ఆపదలు కల్గిన వెంటనే, నిన్ను కొలుచు వారికి సహాయము చేయుటకై నీకు, తమ్ముళ్ళయిన లక్ష్మణ, భరతులను ఇరుప్రక్కల పెట్టుకొని సన్నిధికొచ్చి రక్షించెదవని లోకులు పలుకుచున్నారు. కాబట్టి ఆపదలలో యున్న నన్ను రక్షింపుము భద్రాద్రి రామా! నీకు నమస్కారము.

Dasarathi sathakam-ధాశరథీ శతకం
Dasarathi sathakam-ధాశరథీ శతకం

భ్రమరము కీటకంబుఁగొని పాల్పడిఝాంకరణోపకారియై
భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాదిదుఃఖసం
తమస మెడల్చి? భక్తిహితం బుగ జీవుని విశ్వరూప త
త్త్వము, నధరించుటే మరుదు దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! తుమ్మెద పురుగుని పట్టుకొని తన ఝుంకారంతో తమ్మెదగా మార్చి తిరుగునట్లు పుట్టుకనుండి చీకటిబాపి జీవునినీలో కలుపుకొనుటలో విశేషమేమియునూ లేదుకదా! అలాగే నా పాపపు జన్మను నీలో ఐక్యము పొందునట్లుగా చేయుము రామా! నీకు నమస్కారము.

check Sumati sathakam – సుమతీ శతకం

Leave a Reply