Daily Horoscope 26/08/2021 :

0
86
Daily Horoscope 08/10/2021
Daily Horoscope 08/10/2021

Daily Horoscope 26/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

26, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ తృతీయ
వర్ష ఋతువు
దక్షణాయనము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 26/08/2021
Daily Horoscope 26/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ప్రారంభించే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నిఅమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధు,మిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.

వృషభం

ఈరోజు
ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర దర్శనం చేస్తే మంచి జరుగుతుంది. Daily Horoscope 26/08/2021

 మిధునం

ఈరోజు
శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీమీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.

 సింహం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం

 కన్య

ఈరోజు
ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 తుల

ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మాతృసౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

 వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో సత్పలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 26/08/2021

 ధనుస్సు

ఈరోజు
బాగా ఆలోచించి పనులు చేయాలి. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

 మకరం

ఈరోజు
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

 కుంభం

ఈరోజు
బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది

 మీనం

ఈరోజు
మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది. Daily Horoscope 26/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, ఆగష్టు 26, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి సా5.18 తదుపరి పంచమి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రo:రేవతి రా11.40 తదుపరి అశ్విని
యోగం:శూలం ఉ7.35 తదుపరి గండం
కరణం:బాలువ సా5.18 తదుపరి కౌలువ
వర్జ్యం:ఉ10.54 – 12.36
దుర్ముహూర్తం:ఉ9.57 – 10.47 & మ2.57 – 3.47
అమృతకాలం:రా9.06 – 10.48
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.18

check other posts

Leave a Reply