
Daily Horoscope 25/08/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
25, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
_కృష్ణ తృతీయ _
వర్ష ఋతువు
దక్షణాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలున్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది. Daily Horoscope 25/08/2021
వృషభం
ఈరోజు
కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవారాధన మానవద్దు.
మిధునం
ఈరోజు
ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.
కర్కాటకం
ఈరోజు
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో చంచల బుద్ధితో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
సింహం
ఈరోజు
చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.
కన్య
ఈరోజు
బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. Daily Horoscope 25/08/2021
తుల
ఈరోజు
అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేస్తారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీ దేవిని సందర్శిస్తే మంచిది.
వృశ్చికం
ఈరోజు
శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను వదలొద్దు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు పడతారు. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం మంచిది.
ధనుస్సు
ఈరోజు
అనుకూలమైన కాలం కాదు. మీమీ రంగాల్లో తోటివారిని కలుపుకుపోతే మంచిది. పనుల్లో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
మకరం
ఈరోజు
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.
కుంభం
ఈరోజు
ముఖ్య విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కనకధారాస్తవం పఠించాలి.
మీనం
ఈరోజు
మంచి మనసుతో పనులను ప్రారంభిస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. Daily Horoscope 25/08/2021
Panchangam
శ్రీ గురుభ్యోనమః
బుధవారం, ఆగష్టు 25, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:తదియ సా4.34 తదుపరి చవితి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర రా10.10 తదుపరి రేవతి
యోగం:ధృతి ఉ8.10 తదుపరి శూలం
కరణం:విష్ఠి సా4.34 తదుపరి బవ తె4.56
వర్జ్యం:ఉ7.09 – 8.49
దుర్ముహూర్తం:ఉ11.37 – 12.27
అమృతకాలం:సా5.09 – 6.49
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం:6.18
check other posts