Daily Horoscope 24/08/2021 :

0
75
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 24/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

24, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ ద్వితీయ
వర్ష ఋతువు
దక్షణాయణము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 24/08/2021
Daily Horoscope 24/08/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
మీ పనుల్లో బంధు,మిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. Daily Horoscope 24/08/2021

 వృషభం

ఈరోజు
శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

 మిధునం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి

కర్కాటకం

ఈరోజు
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. చంద్రధ్యానం, దుర్గా ఆరాధన మేలైన ఫలితాన్ని ఇస్తుంది. Daily Horoscope 24/08/2021

 సింహం

ఈరోజు
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. చక్కటి శుభఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు దర్శనం ఉత్తమం

 కన్య

ఈరోజు
లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

తుల

ఈరోజు
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

 వృశ్చికం

ఈరోజు
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

మకరం

ఈరోజు
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.

 కుంభం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

 మీనం

ఈరోజు
ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య విషయాలను మధ్యాహ్నం తర్వాత చేయడం మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 24/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, ఆగష్టు 24, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:విదియ సా4.19 తదుపరి తదియ
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర రా9.08 తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:సుకర్మ రా9.07 తదుపరి ధృతి
కరణం:గరజి సా4.19 తదుపరి వణిజ తె4.26
వర్జ్యం :లేదు
దుర్ముహూర్తం:ఉ8.17 – 9.07 & రా10.53 – 11.39
అమృతకాలం:మ12.58 – 2.36
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.18

check other posts

Leave a Reply