Bhaskara satakam – భాస్కర శతకం

0
51
Bhaskara sathakam - భాస్కర శతకం
Bhaskara sathakam - భాస్కర శతకం

Bhaskara satakam – భాస్కర శతకం

అంగన నమ్మరాదు తనయంకెకురాని మహాబలాడ్యువే
భంగుల మాయలొడ్డి చెఱపందల పెట్టు, వివేకియైన సా
రంగధరుం బదంబుఁగరంబులు గోయఁగజేసెఁదొల్లిచి
త్రాంగియనేకముల్ నుడవరాని కుయుక్తులు పన్ని భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా!స్త్రీ వ్యామోహముచే పురుషుని కోరగా అతడు నిరాకరించినచో వానికి అనేక నిందారోపణములు చేసి, రాజులచే కఠిన శిక్ష విధించు వరకు తన పన్నాగము వదలదు.పూర్వము చిత్రాంగియను స్త్రీ సారంగధరుని ప్రేమించగా, అతడు నిరాకరణ తెలుపగా రాజు వద్దకు వెళ్ళి అనేక ఫిర్యాదులు చేసి అతని కాళ్ళు, చేతులు నరికించినది కదా!అందుకే అలాంటి స్త్రీలను నమ్మరాదు. బలవంతుడైననూ బాధలకు గురియగును.

Bhaskara satakam - భాస్కర శతకం
Bhaskara satakam – భాస్కర శతకం

అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి
న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్
దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మానవులు ఇచ్చిపుచ్చుకొనుట సహజము.అలాగే అవసరమున్న వేళయందు బంధువులు ఒకరినోకరు ప్రేమతో, కష్టముతో నుండిన వేళలయందు ఉద్ధరించుటకు ప్రయత్నములు చేయుట స్నేహమునకు భావం.ఎలాగనగా, నీటిలో పడవల మీద బండ్లు తీలుకొని వెళ్లునట్లు.భూమి మీద బండ్ల మీద పడవలను తీసుకువెళ్ళునట్లు. అలాగే తగిన అవసరము వచ్చిన వేళ ఒకరినొకరు అన్యోన్యతలు పాటించాలని సారాంశము.

check out sumathi satakam poems :

Leave a Reply