Daily Horoscope 23/08/2021 :

0
82
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 23/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

23, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ ప్రతిపత్
వర్ష ఋతువు
దక్షణాయణము ఇందు వాసరే
( సోమవారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 23/08/2021
Daily Horoscope 23/08/2021 :

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఉత్తమం. Daily Horoscope 23/08/2021

 వృషభం

ఈరోజు
శ్రద్ధతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది.

 మిధునం

ఈరోజు
ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

 సింహం

ఈరోజు
బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. Daily Horoscope 23/08/2021

 కన్య

ఈరోజు
మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారు ఉన్నారు. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది.

తుల

ఈరోజు
ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దశావతార స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

 వృశ్చికం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ఒక ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచికాలం. అందరినీ కలుపుకొనిపోతే ఇబ్బంది ఉండదు. శివుడిని ఆరాధించాలి.

 ధనుస్సు

ఈరోజు
మనోబలం ముందుకు నడిపిస్తుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. సమయానికి నిద్రాహారాలు అవసరం. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

 మకరం

ఈరోజు
ప్రారంభించిన పనులను మనోధైర్యంతో సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

కుంభం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

 మీనం

ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వాదశంలో చంద్రగ్రహం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం చేసుకోవడం మంచిది. Daily Horoscope 23/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, ఆగష్టు 23, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి సా4.36 తదుపరి విదియ
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:శతభిషం రా8.38 తదుపరి పూర్వాభాద్ర
యోగం:అతిగండ ఉ10.30 తదుపరి సుకర్మ
కరణం:కౌలువ సా4.36 తదుపరి తైతుల తె4.27
వర్జ్యం: తె3.10 – 4.48
దుర్ముహూర్తం:మ12.28 – 1.18 &
మ2.58 – 3.48
అమృతకాలం:మ1.25 – 3.01
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.19

check other posts

Leave a Reply