Sumati sathakam – సుమతీ శతకం

0
118

Sumati sathakam – సుమతీ శతకం

ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱిగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! బంగారమునకు సమానమైన ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారము ఎట్లు కాదో, అదేవిధంగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు.

Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam – సుమతీ శతకం

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలఁగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! అడిగినపుడు జీతమును ఈయని గర్వియైన ప్రభువుని సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయము చేసుకొని జీవించుట మంచిది అని భావం.

 

Leave a Reply