Daily Horoscope 22/08/2021 :

0
84
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 22/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

22, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల చతుర్దశి
వర్ష ఋతువు
దక్షణాయణము భాను వాసరే
( ఆదివారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 22/08/2021
Daily Horoscope 22/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది. Daily Horoscope 22/08/2021

 వృషభం

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్నిఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

మిధునం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను ప్రారంభిస్తారు. మహాలక్ష్మీఅష్టోత్తరం చదివితే మంచిది.

 కర్కాటకం

ఈరోజు
గొప్ప శుభసమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేహసౌఖ్యం,సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. చేపట్టిన పనులలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

 సింహం

ఈరోజు
ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

కన్య

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం.

 తుల

ఈరోజు
చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. మిత్రుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది Daily Horoscope 22/08/2021

వృశ్చికం

ఈరోజు
సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాలను చేకూరుస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం

మకరం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి

 కుంభం

ఈరోజు
కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శనిధ్యాన శ్లోకం చదువుకోవాలి.

మీనం

ఈరోజు
ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయమాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.  Daily Horoscope 22/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, ఆగష్టు 22, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి సా5.22 తదుపరి బహుళ పాడ్యమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా8.36 తదుపరి శతభిషం
యోగం:శోభనం మ12.16 తదుపరి అతిగండ
కరణం:విష్ఠి ఉ5.58 తదుపరి బవ సా5.22ఆ తదుపరి బాలువ తె4.59
వర్జ్యం :తె3.48 – 5.24
దుర్ముహూర్తం :ఉ4.39 – 5.29
అమృతకాలం:ఉ10.23 – 11.57
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.47 సూర్యాస్తమయం:6.20
శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ
నూతన యజ్ఞోపవీతధారణ, యజుర్వేద ఉపాకర్మ
శ్రీ హయగ్రీవ జయంతి

check other posts

Leave a Reply