Daily Horoscope 21/08/2021 :

0
113
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 21/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

21, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల చతుర్దశి
వర్ష ఋతువు
దక్షణాయణము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 21/08/2021
Daily Horoscope 21/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం. Daily Horoscope 21/08/2021

 వృషభం

ఈరోజు
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వల్ల ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

 మిధునం

ఈరోజు
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

 కర్కాటకం

ఈరోజు
ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది. Daily Horoscope 21/08/2021

 సింహం

ఈరోజు
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కన్య

ఈరోజు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

 తుల

ఈరోజు
లక్ష్య సాధనలో అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

 వృశ్చికం

ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

 మకరం

ఈరోజు
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

కుంభం

ఈరోజు
ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్రనామాలు పారాయణ చేయడం మంచిది.

 మీనం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 21/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, ఆగష్టు 21, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్థశి సా6.35 తదుపరి పౌర్ణమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:శ్రవణం రా9.01 తదుపరి ధనిష్ఠ
యోగం:సౌభాగ్యం మ2.22 తదుపరి శోభనం
కరణం:గరజి ఉ7.22 తదుపరి వణిజ సా6.35 ఆ తదుపరి విష్ఠి
వర్జ్యం:రా1.56 – 3.31
దుర్ముహూర్తం : ఉ5.47 – 7.27
అమృతకాలం:ఉ10.57 – 12.30
రాహుకాలం :ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం: మ1.30 – 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం: 6.20

check other posts

Leave a Reply