Subhashitam – సుభాషితమ్ 

0
96

Subhashitam – సుభాషితమ్ 

శ్లో|| కర్మాత్మవిజ్ఞాన మపి క్రమేణ
సంసాద్య మేకేన నరేణ వేద।
యః కర్మణా చిత్తవిశుద్ధి మాప్య
స విద్యయాప్నోత్యమృతం హి విద్వాన్॥

తా|| కర్మ, జ్ఞానములను రెంటినీ ప్రతి మానవుడు క్రమంగా సంపాదించవలెను. కర్మలవల్ల చిత్తశుద్ధి, అనగా నిష్ఠ కలిగి జ్ఞానార్జన సుగమమై తద్వారా మానవుడు అమృతత్త్వమును పొందగలుగుచున్నాడు.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో|| నాస్తి విద్యా సమం చక్షుః నాస్తి సత్య సమం వ్రతమ్|
నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖమ్||

తా|| “విద్యతో సమానమైన నేత్రము లేదు. సత్యమును పలుకుటతో సమానమైన వ్రతము లేదు. కోరికతో సమానమైన దుఃఖము లేదు. త్యాగముతో సమానమైన సుఖము లేదు”.

Leave a Reply