
Daily Horoscope 20/08/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
20, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల త్రయోదశి
వర్ష ఋతువు
దక్షణాయణము భృగు వాసరే
( శుక్ర వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
ప్రారంభించిన పనిలో శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరనిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం.
వృషభం
ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది. Daily Horoscope 20/08/2021
మిధునం
ఈరోజు
గ్రహబలం బాగుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.
కర్కాటకం
ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది.
సింహం
ఈరోజు
అనుకూలమైన కాలం. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శనిధ్యానం చదవాలి.
కన్య
ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం. Daily Horoscope 20/08/2021
తుల
ఈరోజు
ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.
వృశ్చికం
ఈరోజు
ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ వ్యాపార స్థలాలలో సమర్ధత పెరుగుతుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శనిధ్యానం శుభప్రదం.
మకరం
ఈరోజు
మిశ్రమ కాలం నడుస్తోంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శివారాధన శుభప్రదం.
కుంభం
ఈరోజు
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
మీనం
ఈరోజు
మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తి అవసరం. లక్ష్మీ ఆరాధన శుభప్రదం. Daily Horoscope 20/08/2021
Panchangm
శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, ఆగష్టు 20, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి రా8.10 తదుపరి చతుర్థశి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ రా9.48
తదుపరి శ్రవణం
యోగం:ఆయుష్మాన్ సా4.46 తదుపరి సౌభాగ్యం
కరణం:కౌలువ ఉ9.07 తదుపరి తైతుల రా8.10 ఆ తదుపరి గరజి
వర్జ్యం:ఉ6.33 – 8.05 & రా1.40 – 3.13
దుర్ముహూర్తం:ఉ8.17 – 9.07 &
మ12.28 – 1.18
అమృతకాలం:మ3.42 – 5.13
రాహుకాలం :ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.20
check other posts