
The Divine History of Sri Venkateswara – 70 – వేంకటేశ్వర దివ్య చరిత్ర – 70 – స్వామి వారి ఆలయం – భారతదేశములో యిది పరమపావనమైన పుణ్యక్షేత్రముఅయినందువల్లను, ఆపద మ్రొక్కులవాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి కాపాడడములో అపార కరుణామూర్తి అయినందువల్లను, ఈ యాత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్లను, నిత్యమూ వేలాది భక్తులు యీ కొండకు వస్తూ పోతూ వుంటారు.
ఎన్నెన్నో కానుకలు, నిలువు దోపిళ్ళు సమర్పిస్తుంటారు. మ్రొక్కుబడులు చెల్లించుకొంటారు. వీరందరితో యీ క్షేత్రము నిత్య సత్య వైకుంఠములా దేదీప్యమానముగా వుంటుంది.
భారతదేశములో యిది పరమపావనమైన పుణ్యక్షేత్రముఅయినందువల్లను, ఆపద మ్రొక్కులవాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి కాపాడడములో అపార కరుణామూర్తి అయినందువల్లను, ఈ యాత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్లను, నిత్యమూ వేలాది భక్తులు యీ కొండకు వస్తూ పోతూ వుంటారు.
ఎన్నెన్నో కానుకలు, నిలువు దోపిళ్ళు సమర్పిస్తుంటారు. మ్రొక్కుబడులు చెల్లించుకొంటారు. వీరందరితో యీ క్షేత్రము నిత్య సత్య వైకుంఠములా దేదీప్యమానముగా వుంటుంది. The Divine History of Sri Venkateswara – 70
ఆలయానికి తూర్పుదిక్కున గల గాలిగోపురము చాలా చూడముచ్చటగా వుంటుంది. గర్భాలయము మీద విమాన గోపురము బంగారు రేకులతో కప్పబడి ఎంతో రమణీయముగా వుంటుంది.
దీనినే ‘ఆనంద నిలయము’ అంటారు. ఆలయములో మూడు ప్రాకారాలున్నాయి. వాటిలో మొదటి ప్రాకారాన్ని ‘సంపంగి ప్రదక్షిణము’ అంటారు. దీని చేరువనే బంగారు రేకులతో చేసిన ధ్వజస్తంభము, దాని ముంగిట బలిపీఠము వున్నాయి.

రెండవ ప్రాకారాన్ని ‘‘విమాన ప్రదక్షిణము’’ అంటారు. ఈ ప్రాకారములోనే పరిమళ గది, పాకశాల, కళ్యాణమండపము, వామన మండపములున్నూ, వరదరాజస్వామి, వకుళమాలిక, రామానుజాచార్యులు ఆలయాలు వున్నాయి.
ఇక మూడవ ప్రాకారాన్ని ‘వైకుంఠ ప్రదక్షిణము’ అంటారు. దీనిని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రము తెరచి వుంచుతారు. గర్భాలయమునకు ముందు బంగారు తలుపులు వుంటాయి.
ఈ వాకిలిని ‘బంగారు మండపము’ అంటారు. దీనికి ముందుగా ‘రంగ మండపము’ వుంది. ఈ మండపములోనే స్వామి వారి హుండీ వుంటుంది.
సంపంగి చెట్లతో నిండిన ప్రాకారము, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలి దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూవుంటాం.
ఈ వెండివాకిలి గోపురం యొక్క ప్రాకారానికి,బయట మహాద్వార ప్రాకారానికి మధ్యగల సుమారు 30అడుగులు వున్న ప్రదక్షిణా మార్గాన్ని సంపెంగ ప్రదక్షిణం అనిఅంటారు.
ఆలయంలో మనం ప్రవేశించిన మొదటి ప్రదక్షిణామార్గమే ఈ సంపంగి ప్రదక్షిణ మార్గం.
అత్తాళిప్పుళిని (చింతచెట్టు)
చాలా కాలం క్రిందట ఈ సంపెంగిఆవరణంలోని మహాద్వారానికి దగ్గరగా ఒక పెద్ద చింతచెట్టు వుండేదట. దానికి కొమ్మలు, రెమ్మలు శాఖోపశాఖలుగా పెరిగి అతి విశాలంగా వ్యాపించి ఆ చెట్టునీడ ఎటూతిరగక ఆ వృక్షం మూలంలోనే స్థిరంగా వుండేది.
అందువల్ల అది నీడతిరుగని చింత చెట్టుగా ప్రసిద్ధిచెందింది. అంతమాత్రమే కాదు అది నిద్రపోని చింతచెట్టుగా కూడా పేర్కొనబడినది. దాని శాఖలు కొన్ని చిగురించగా, మరి కొన్ని శాఖలు పుష్పించగా, ఇంకొన్ని శాఖలు కాయలు, పండ్లు కాస్తుండేవి.
ఇలా అన్ని కాలాలు విశ్రాంతి ఎరుగక ఆ చెట్టు నిరంతరం చిగురించటం, పుష్పించటం, ఫలించటం వల్ల అది నిద్రపోని చెంత చెట్టుగా పిలవబడుతుంది. ఈ చెట్టు క్రింద పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగివున్నాడు. The Divine History of Sri Venkateswara – 70
ఆ తరువాత స్వామివారు విగ్రహ మూర్తిగా స్వయంభూ యై వెలసి పుట్టలో నిక్షిప్తమై వున్నాడు.
ఆ నీడ తిరుగని, నిద్రే ఎరుగని చింత చెట్టు సాక్షాత్తూ ఆదిశేషుడని, ఆ చెట్టుక్రింద పుట్ట దేవకీదేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి.
అట్టి సమయంలో మొట్టమొదట గోపీ నాథుడనే వైఖానసుడు ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణీ దక్షిణతీరంలో చింతచెట్టు క్రింద పుట్టలో వున్న వేంకటేశ్వరుని దర్శించి పుట్టలోని ఆ స్వామి వారి పుష్కరిణీ పశ్చిమతీరంలో అంటే ప్రస్తుతం శ్రీవారు వున్న చోటు ప్రతిష్టించి ఆనాటి నుండి అక్కడే ఉంటూ ఆ స్వామికి అర్చనాదిపూజాదిక్రమములు చేస్తూ వున్నాడు.
ఆ తరువాత రంగదాసుడు అనే భక్తుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఒక బావిత్రవ్వి సంపెంగి, చేమంతి మున్నగు చెట్లను పెంచి శ్రీ స్వామి వారి పూజకవసరమైన పూలను,
పండ్లను సమర్పిస్తూ అర్చకుడైన గోపీనాధుడుకి సహాయంగా ఉండేవాడు
ఈ రంగాదాసే ఈ జన్మలో తొండమాన్ రాజుగా జన్మించి శ్రీనివాస స్వామికి గోపురప్రాకారాదులు నిర్మించాడట.
ఆ సందర్భంలో తనకి ప్రీతిపాత్రమైన ఆ చింతచెట్టును ఆ చింత చెట్టుకు కొద్ది దూరంలోనే వుంటూ లక్ష్మీదేవికి ఆవాసస్థానమై,అత్యంత ప్రియమై ఎల్లప్పుడూ పుష్పించే చంపకవృక్షాన్ని మాత్రం రక్షించి,
ఇక మిగిలిన చెట్లను తొలగించి ఆలయప్రాకారాదులు నిర్మించవలసిందన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశాలని తొండమానుడు నిర్వర్తించాడని వేంకటాచలమహాత్య గ్రంధం తెలుపుతుంది.
పిదప 15వ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా తొలిసారిగా వేంకటాచల యాత్ర చేసిన సందర్భంలో నీడ తిరుగని చింత చెట్టును దర్శించి సేవించినట్లుగా అన్నమాచార్య జీవిత చరిత్ర వలన తెలుస్తుంది.
check other posts