Dasarathi sathakam-ధాశరథీ శతకం

0
42

Dasarathi sathakam-ధాశరథీ శతకం

భానుఁడు తూర్పునందు గనుపట్టినఁబావక చంద్రతేజముల్
హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁబరదైవ మారీచు లడంగకుండునే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! సూర్యకాంతికి అగ్నిమున్నగు కాంతులు క్షీణించినట్లు, నీ పద ధ్యానము యొక్క ప్రకాశముచే జగమంతయు నిండి ఉన్నది. అందుచే ఇతర దేవతల ప్రకాశము క్షీణించిపోవుచున్నది. అందుచే కావున ఇతర దేవతలను ఆశ్రయించక నిన్నే ఆశ్రయించుచున్న నేను మోక్షపద స్థానమును కోరుచున్నాను. రాక్షసుల గర్వమును హరించిన రామా! నీకు నమస్కారము.

Dasarathi sathakam-ధాశరథీ శతకం
Dasarathi sathakam-ధాశరథీ శతకం

నీ మహనీయతత్త్వరస నిర్ణయబోధ కథామృతాబ్దిలో
దా మును గ్రుంకులాడక వృధా తను కష్టముజెంది మానవుం
డీ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామస పంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: నీ గొప్పతత్వముతో కూడిన కథామృత సముద్రములో మునగక, శరీర కష్టము చెంది మనుజులెన్ని తీర్థముల మునిగిననూ, మనస్సున కంటిన తమోగుణమను బురద వీడిపోవద్దు గదా! అలాగే దుర్వికార చేష్టలతో పాపపు పనులు చేసినాను. నన్ను వాటిబారి నుండి రక్షింపుము రామా! నీకు నమస్కారము.

Leave a Reply