Kumara Shatakam – కుమార శతకం

0
69

Kumara Shatakam – కుమార శతకం

పెద్దలు వద్దని చెప్పిన
పద్దులఁబోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదఁబరికించుట
కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు.

Kumara Shatakam - కుమార శతకం
Kumara Shatakam – కుమార శతకం

ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁదలఁపుఁ కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.

Leave a Reply