Home PANCHANGAM Daily Horoscope 18/08/2021 :

Daily Horoscope 18/08/2021 :

0
Daily Horoscope 18/08/2021 :

Daily Horoscope 18/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

18, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల ఏకాదశి
వర్ష ఋతువు
దక్షణాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 18/08/2021
Daily Horoscope 18/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది. Daily Horoscope 18/08/2021

 వృషభం

ఈరోజు
అవసరానికి తగిన సాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం శుభప్రదం.

 మిధునం

ఈరోజు
శుభ సమయం. గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు
మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మీ దర్శనం శుభప్రదం.

 సింహం

ఈరోజు
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

 కన్య

ఈరోజు
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు. Daily Horoscope 18/08/2021

 తుల

ఈరోజు
మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాలను కలిగిస్తుంది.

 వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

 ధనుస్సు

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

 మకరం

ఈరోజు
చిత్తభ్రంశం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధనతో మంచి జరుగుతుంది.

 కుంభం

ఈరోజు
శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

మీనం

ఈరోజు
ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 18/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, ఆగష్టు 18, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా12.13 తదుపరి ద్వాదశి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల రా12.17 తదుపరి పూర్వాషాఢ
యోగం:విష్కంభం రా10.24 తదుపరి ప్రీతి
కరణం:వణిజ మ1.23 తదుపరి భద్ర రా12.13 ఆ తదుపరి బవ
వర్జ్యం:ఉ9.19 – 10.49 &
రా10.47 – 12.17
దుర్ముహూర్తం :ఉ11.38 – 12.28
అమృతకాలం:సా6.18 – 7.47
రాహుకాలం:మ12.00 – 1.30
సయమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.22
సర్వ ఏకాదశి

check otherr posts

Leave a Reply

%d bloggers like this: