Sumati sathakam – సుమతీ శతకం

0
68
Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam - సుమతీ శతకం

Sumati sathakam – సుమతీ శతకం

పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్
దన భుక్తియెడలఁదల్లియు
యనఁదన కులకాంత యుండనగురా సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! లోకమునందు కులకాంతలు ఇంటి పనులయందు దాసివలె, భోగించునపుడు రంభవలె, ఆలోచన చెప్పునపుడు మంత్రివలె, భోజనము పెట్టునపుడు తల్లివలె భర్తయందు అనురాగంతో ఆచరించాలి అని భావం.

Sumati sathakam - సుమతీ శతకం
Sumati sathakam – సుమతీ శతకం

ఎప్పుడుఁదప్పులు వెదకెడు
నప్పురుషునిఁగొల్వఁగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

తాత్పర్యం: ఓ సుమతీ! నల్లతాచు యొక్క పాడగా నీడను వసించు కప్ప బతుకుదెంత కాలము? అంటే పాము తాను పెట్టిన గుడ్లను తానే తినును. అలాగే నీడకొరకున్న కప్పను కూడా ఏదో ఒక సమయమున మింగును. అలాగే ఎల్లప్పుడూ దోషములు వెదకుచూ ఉన్న యజమానుని సేవ కడుంగడు కష్టతరము. ప్రాణాపాయమని వ్యక్తమగుచున్నది. వాని బతుకు కప్పవలె పోల్చినాడు కవి.

Leave a Reply