Daily Horoscope 17/08/2021 :

0
99
Daily Horoscope 08/10/2021
Daily Horoscope 08/10/2021

Daily Horoscope 17/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

17, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల దశమి
వర్ష ఋతువు
దక్షణాయణము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 17/08/2021
Daily Horoscope 17/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చేపట్టే పనిలో శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. మనోవిచారాన్ని కలిగించే వాటికి జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది. Daily Horoscope 17/08/2021

వృషభం

ఈరోజు
ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివ ఆరాధన చేస్తే మంచిది.

మిధునం

ఈరోజు
ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తిని ఇస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
లక్ష్య సాధనలో అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వర దర్శనం శుభప్రదం.

సింహం

ఈరోజు
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి . కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి..మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం. Daily Horoscope 17/08/2021

 కన్య

ఈరోజు
పట్టుదలతో చేపట్టిన పనులలో విజయాన్నిసాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

తుల

ఈరోజు
మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

 వృశ్చికం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది

ధనుస్సు

ఈరోజు
కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

మకరం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మంచిది.

 కుంభం

ఈరోజు
అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రం పఠించాలి Daily Horoscope 17/08/2021

మీనం

ఈరోజు
చేపట్టే పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంగా పనిచేయాలి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. సూర్యాష్టకం చదివితే శుభప్రదం.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, ఆగష్టు 17, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి రా2.33 తదుపరి ఏకాదశి
వారo:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా1.50తదుపరి మూల
యోగం:వైధృతి రా1.13 తదుపరి విష్కంభం
కరణం:తైతుల మ3.46 తదుపరి గరజి రా2.33 ఆ తదుపరి వణిజ
వర్జ్యం:ఉ8.42 – 10.11
దుర్ముహూర్తం:ఉ8.17 – 9.07 &
రా10.56 – 11.41
అమృతకాలం:సా5.38 – 7.08
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.22
సింహసంక్రమణం :మ3.52నుండి

check other posts

Leave a Reply