Dasarathi sathakam-ధాశరథీ శతకం

0
55
Dasarathi sathakam-ధాశరథీ శతకం
Dasarathi sathakam-ధాశరథీ శతకం

Dasarathi sathakam-ధాశరథీ శతకం

వారిచరావతారమున వారధిలోఁజొషుబాఱిఁక్రోధవి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారత నిచ్చి తీవెగ దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! మత్స్యావతారమునందు వేదములను దొంగలించుకొని పోయిన రాక్షస వీరుడగు సోమకాసురుని పట్టుకొనుటకు, కోపాతిశయను గల్గి సముద్రము లోపలకు అతివేగముగా జనివానిని చంపి, వేదములను రక్షించినవాడవు నీవు తప్ప దేవతలయందు ఎవరున్నారు రామా! మరియు మిక్కిలి యౌదార్యముతో బ్రహ్మకు వేదములను అప్పగించితివి కదా! అట్టి నీవు నన్ను కాపాడుము రామా! నేకు నమస్కారము.

Dasarathi sathakam-ధాశరథీ శతకం
Dasarathi sathakam-ధాశరథీ శతకం

కర మనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధి మథించుచున్నచో
ధరణి చలింప లోకములు తల్లడ మందఁగఁగూర్మమై ధరా
ధరము ధరించి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! దేవతలను,రాక్షసులను, వైరములతో కూడి మందర పర్వతమును కవ్వముగాను, సర్వరాజగు వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసి పాల సముద్రమును చిలుకుచుండగా, అపుడా కొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం చూచి కూర్మావతారం యెత్తి కొండను వీపుమీద దాల్చిన వాడవు నీవే గదా! కాబట్టి పైవలె మమ్ము కూడా రక్షింపుము.

check other posts

Leave a Reply