Daily Horoscope 16/08/2021 :

0
63
Daily Horoscope 10/10/2021
Daily Horoscope 10/10/2021

Daily Horoscope 16/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

16, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల అష్టమి
వర్ష ఋతువు
దక్షణాయణము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 16/08/2021
Daily Horoscope 16/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలను పఠిస్తే అన్నివిధాలా మంచిది. Daily Horoscope 16/08/2021

 వృషభం

ఈరోజు
మీరు పనిచేసే రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. లలితా దేవి నామస్మరణ శుభప్రదం.

 మిధునం

ఈరోజు
వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

 కర్కాటకం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు మంచినిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

 సింహం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొంటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

 కన్య

ఈరోజు
అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పెద్దలు ప్రశంసలు లభిస్తాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మరువలేని శుభఫలాలను ప్రసాదిస్తాయి. కులదైవ సందర్శనం శుభప్రదం. Daily Horoscope 16/08/2021

 తుల

ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. మనోబలం పెరగడానికి హనుమాన్ చాలీసా చదవాలి .

 వృశ్చికం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొంటారు. లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే ఇంకా మంచిది.

ధనుస్సు

ఈరోజు
మిశ్రమకాలం. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

 మకరం

ఈరోజు
శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. ఆపదలో సహాయం చేసేవారున్నారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శివారాధన చేయడం మంచిది.

 కుంభం

ఈరోజు
మనోబలంతో చేసే పనులు సిద్ధిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహరాలలో ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్య విషయాల్లో అస్థిర బుద్ధిని రానీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.

 మీనం

ఈరోజు
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది. Daily Horoscope 16/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, ఆగష్టు 16, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి: అష్టమి ఉ7.28 తదుపరి నవమి తె5.00
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:అనూరాధ తె3.30
యోగం:బ్రహ్మం ఉ7.21 తదుపరి ఇంద్రం తె4.16
కరణం:బవ ఉ7.28 తదుపరి బాలువ సా6.14 ఆ తదుపరి కౌలువ తె5.00
వర్జ్యం: ఉ8.52 – 10.21
దుర్ముహూర్తం:మ12.29 – 1.20 & మ3.01 – 3.51
అమృతకాలం:సా5.48 – 7.18
రాహుకాలం:ఉ7.30 – 9.00
సయమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం: 5.45
సూర్యాస్తమయం:6.24

check other posts

Leave a Reply