Daily Horoscope 15/08/2021 :

0
365
Daily Horoscope 22/10/2021
Daily Horoscope 22/10/2021

Daily Horoscope 15/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల సప్తమి
వర్ష ఋతువు
దక్షణాయణము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 15/08/2021
Daily Horoscope 15/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి. Daily Horoscope 15/08/2021

వృషభం

ఈరోజు
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు గృహాలలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

 మిధునం

ఈరోజు
ప్రయత్నకార్యసిద్ధి కలదు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. ప్రయోజనకరమైన భాషణం చేయండి. ఇష్టదేవతాస్తోత్రం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

 కర్కాటకం

ఈరోజు
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.

సింహం

ఈరోజు
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

 కన్య

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

 తుల

ఈరోజు
గొప్ప శుభకాలం. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 15/08/2021

 వృశ్చికం

ఈరోజు
మిశ్రమకాలం. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. లలితా సహస్ర నామ పారాయణతో మంచి జరుగుతుంది.

ధనుస్సు

ఈరోజు
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు పూర్తవుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పట్టుదలతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శని, గురు అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

 మకరం

ఈరోజు
ముఖ్య విషయాల్లో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. శివ సహస్ర నామం పఠించడం బాగుంటుంది.

 కుంభం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఇష్టదేవతానామాన్ని జపించాలి.

మీనం

ఈరోజు
ఉత్సాహంగా ముందుకు సాగండి. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. లింగాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. Daily Horoscope 15/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, ఆగష్టు 15, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి ఉ9.51తదుపరి అష్టమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:స్వాతి ఉ6.46 తదుపరి విశాఖ తె5.09
యోగం:శుక్లం ఉ10.21 తదుపరి బ్రహ్మం
కరణం:వణిజ ఉ9.51 తదుపరి విష్ఠ రా8.39 ఆ తదుపరి బవ
వర్జ్యం:ఉ11.59 – 1.28
దుర్ముహూర్తం:సా4.42 – 5.32
అమృతకాలం: రా8.56 – 10.26
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 – 1.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:తుల
సూర్యోదయం: 5.45
సూర్యాస్తమయం: 6.24

check other posts

Leave a Reply