Daily Horoscope 14/08/2021 :

0
173
Daily Horoscope 10/10/2021
Daily Horoscope 10/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల షష్ఠి
వర్ష ఋతువు
దక్షణాయణము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 14/08/2021
Daily Horoscope 14/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మనసు పెట్టి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. కుజ శ్లోకం చదవడం మంచిది. Daily Horoscope 14/08/2021

వృషభం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. బుద్దిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు ఆలయ సందర్శనం శుభాన్ని ఇస్తుంది.

 మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

 కర్కాటకం

ఈరోజు
చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీ రామనామాన్ని జపించడం శుభప్రదం.

 సింహం

ఈరోజు
మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. పెద్దల యందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కన్య

ఈరోజు
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం. Daily Horoscope 14/08/2021

 తుల

ఈరోజు
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

వృశ్చికం

ఈరోజు
చేతిదాకా వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో స్థానచలన సూచితం. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

 ధనుస్సు

ఈరోజు
పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామాన్ని పఠించడం మంచిది

 మకరం

ఈరోజు
గ్రహబలం అనుకూలంగా ఉంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని ఇస్తుంది.

 కుంభం

ఈరోజు
చేపట్టిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

 మీనం

ఈరోజు
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్పలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది. Daily Horoscope 14/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, ఆగష్టు 14, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి రా12.27 తదుపరి సప్తమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:చిత్ర ఉ8.35 తదుపరి స్వాతి
యోగం:శుభం మ1 32 తదుపరి శుక్లం
కరణం:తైతుల మ12.27 తదుపరి గరజి రా11.09 ఆ తదుపరి వణిజ
వర్జ్యం :మ1.45 – 314
దుర్ముహూర్తం :ఉ6.02 – 7.42
అమృతకాలం:రా10.37 – 12.06
రాహుకాలం: ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.45
సూర్యాస్తమయం:6.26

Leave a Reply