Home Bhakthi Sri venkateswara Divyacharitra-30

Sri venkateswara Divyacharitra-30

0

Sri venkateswara Divyacharitra-30 – శ్రీవేంకటేశ్వర దివ్యచరిత్ర-30 – స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాన్. శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలను ఈయన నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో ఉన్నాయి.

ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలు ఇద్దరు సరసల్లాపాలతో మునిగి ఉన్నారు. ఆ సమయంలో ప్రభువైన తొండమాన్ చక్రవర్తి రహస్య బిల మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామీ వేంకటేశా… భక్తవత్సలా.. కాపాడు అంటూ వేడుకొన్నాడు.

తొండమాన్ శరణుకోరగానే శ్రీవారు..తొండమాన్.. ముందు నా పాదాలను వదులు. అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు ఏం భయం లేదు. ఎందుకింత ఆందోళనగా ఉన్నావు. Sri venkateswara Divyacharitra-30

నీ శరీరం చూడు.. ఎంత వణుకుతుందో. ముచ్చెమటలతో నీ దేహమంతా తడిసిపోయింది. ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్పారు.

ఆ తర్వాత తొండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొచ్చాడు.

నేను ఒక ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో, తెలియక చేశానో నాకు అంతుబట్టడం లేదు. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తున్నది స్వామి.

శరణాగతవత్సులుడైన నీవు నాకు అభయ ప్రదానం చేయడం వల్ల నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది. నేను చేసిన ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అన్నాడు.

రెండేళ్ళకు పూర్వం ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు కాశీ క్షేత్రానికి పోతూ తన భార్యా పిల్లతో కలిసి నా దగ్గరకు వచ్చాడు.

గర్భవతి అయిన తన భార్యను ఐదేళ్ల కుమారుడిని నాకు అప్పచెబుతూ నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యాపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెప్పాడు తొండమాన్. Sri venkateswara Divyacharitra-30

ఆ తర్వాత బ్రాహ్మణుని కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలుగజేశాను. అంతేకాదు వారికి ఇతరుల వల్ల హాని కలుగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కానీ విధి బలీయము.

కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మరిచిపోయాను.

ఇలా రెండేళ్ళు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకుని నా దగ్గరికి వచ్చాడు. నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారు. నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు

నాకు ఏం చెప్పాలో అర్థం కాక. వెంటనే తాళం వేసిన భవనం వద్దకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణునికి ఏం చెప్పాలో తెలియక… అన్నీ అబద్ధాలు చెప్పాను.

నీకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందరూ కలిసి మా వాళ్లతో వేంకటాచలపతి కొండకు వెళ్ళారు.

మరో రెండు రోజుల్లో వస్తారని చెప్పాను అని తప్పించుకుని ఇక్కడకు వచ్చానని చెప్పాడు తొండమాన్.

వెంటనే శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు సాయం చేస్తున్నాను.

“నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను.

ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను” అంటూ శపధం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరికి తీసుకురా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలిపాడు Sri venkateswara Divyacharitra-30

భగవానుడుగు శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పున గల దివ్యసరోవరము (అస్థి తీర్థంలో) వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షించాడు.

వారు ముగ్గురూ సజీవులయ్యారు. తొండమానుడు ఆనందించి వారందరనీ కూర్మునకు అప్పగించాడు.

వారందరూ ఆ అస్థితీర్థ మహాత్మ్యమును తెలసుకొన్నవారై అందులో స్నానమాడి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖముగా జీవించారు.

ఈ విచిత్ర సంఘటనకు దేవతలు పూలవాన కురిపించారు. అప్పటి నుంచి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది.

నరకంలో ఉన్న వారి అస్థిల్ని కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు

అప్పుడు బ్రహ్మాదిదేవతలు “బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది” అని ప్రార్ధించారు.

అప్పుడు శ్రీనివాసుడు “దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను” అంటూ “కన్యామాసం, శ్రవణానక్షత్రం” రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు.

లక్ష్మి పద్మసరోవరమున అవతరించగా, శ్రీనివాసుడు ఆనంద మండపములో శిలారూపమును పొందినాడు.

వకుళాదేవి ఆ విగ్రహము మెడలో మాలగా మారిపోయినది.

Leave a Reply

%d bloggers like this: