Home Bhakthi Vaalmiki Ramayanam – 64

Vaalmiki Ramayanam – 64

0
Vaalmiki Ramayanam – 64
Vaalmiki Ramayanam -76
Vaalmiki Ramayanam – 64 – రామాయణం – 64 – తరువాత రాముడన్నాడు ” అంతా బాగానే ఉంది కాని, ఎవరు నూరు యోజనముల సముద్రమును దాటి వెళతారు? ఈ వానర సముహముతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము?
అందులో కౄరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా!” అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ” రామా! నువ్వు శోకము పొందవద్దు. నీ ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకము చేసుకో.
నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు ఎవరు నీముందు నిలబడగలిగిన మొనగాడు? నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి.
నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధముగా ఉన్నది. ఒకసారి వానరసైన్యము లంకాపట్టణములో అడుగుపెడితే రావణుడు నిహతుడయ్యిపోయినట్టే.
అందుకని సముద్రాన్ని దాటడము ఎలా అన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచిమార్గము మాకు ఉపదేశం చెయ్యి ” అన్నాడు.
సుగ్రీవుడి మాటలకి ఉత్సాహము పొందిన రాముడు ” నిజమే ! నేను తలుచుకుంటే నా తపఃశ్శక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను.
నా అస్త్ర ప్రయోగము చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను ” అని చెప్పి హనుమ వంక తిరిగి” హనుమా! ఆ లంకా పట్టణము యొక్క బలం ఏమిటో చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది? ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి? ” అని అడిగాడు.
హనుమంతుడు ” శత్రు దుర్భేధ్యమైన లంకాపట్టణము నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూట పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. Vaalmiki Ramayanam – 64
దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. లంకాపట్టణము చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఒక విశాలమైన అగడ్త నిర్మించారు. దానిమీద నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉంటాయి.
ఈ వంతెనల మీద సర్వకాలములయందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చెయ్యబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గములున్నాయి. అరణ్యములో ఉన్న దుర్గమునకు అరణ్య దుర్గమని పేరు.
నది చేత రక్షింపబడుతున్న దుర్గమునకు నదీదుర్గమని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గమునకు పర్వతదుర్గమని పేరు. కృత్రిమముగా నిర్మించిన దుర్గమునకు కృత్రిమ దుర్గమని పేరు.
లంకాపట్టణము ఈ నాలుగు దుర్గములతోటి శోభిల్లుతున్నది. లంకకి నాలుగువైపులా నాలుగుద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారము దగ్గర పదివేలమంది రాక్షసులు ఆయుధములు పట్టుకొని గుఱ్ఱముల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. దక్షిణ ద్వారమును లక్షమంది సైనికులు కాపు కాస్తుంటారు.
పదిలక్షలమంది పశ్చిమద్వారమును కాపు కాస్తుంటారు. కోటిమంది సైనికులు ఉత్తర ద్వారమును కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడమంటే మహా ప్రీతికరమైన విషయం.
రాజద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలు, పరిఘలు బిగించి ఉంటాయి. లంకని చేరుకొని యుద్ధం చెయ్యడము అంత సామాన్యమైన విషయము కాదు.
మీరు ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకని సర్వనాశనంము చేస్తారు.
నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడున్న మొత్తం రాక్షససైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనము చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరిచేసాను.
Vaalmiki Ramayanam -64
Vaalmiki Ramayanam -64
అనేక ప్రాసాదములను విరగొట్టాను. ప్రస్తుతము లంక చెదిరిపోయిన శోభతో ఉన్నది. రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయమని నేను అనుకుంటున్నాను ” అన్నాడు.
సుగ్రీవుడు ” నాకన్నీ శుభనిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతున్నది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్టే. మనం బయలుదేరడానికి మంచి ముహూర్త నిర్ణయము చెయ్యండి. ” అన్నాడు.
రాముడు ” మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశములో మధ్యన ఉన్నాడు. మా ఇక్ష్వాకువంశీయులందరిది ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రము.  నక్షత్రము పునర్వసు నక్షత్రమునకు సాధతార అవుతుంది.
ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగున్నది. మన ఉత్తర క్షణము సైన్యముతో బయలుదేరదాము ” అన్నాడు. Vaalmiki Ramayanam – 64
రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషమును పొంది ” జై శ్రీరాం, జై జై రామ! బయలుదేరదాము – లంక చేరిపోదాము – రావణుడిని సంహరిద్దాము ” అన్నాయి.
రాముడు సుగ్రీవుడితో ” వృద్ధులైన వారు, శరీరము లో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి.
ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్షవానరములు వెళ్ళాలి. మిగతా వానరములు అన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి.
కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు. అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి. తాగడానికి మంచి నీరు దొరకాలి. పళ్ళు, తేనె దొరకాలి.
అటువంటి అరణ్య మార్గమును నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి.
ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షలమంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి.
వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరములలో శత్రువులు విషం కలిపి నాశనము చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరములను విడిచిపెట్టే ఉపద్రవము ఏర్పడవచ్చు.
చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదంము ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగములో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి ” అని చెప్పాడు.
వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు ” ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో ” అని ఒకడు, ” నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి.
చూడరా నా కండ ” అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు.
కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతున్నదా అన్నట్టుగా ఉన్నది.
వాళ్ళందరూ బయలుదేరి దక్షిణదిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకుని అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రము కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.
రాముడు ” మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను మూడు భాగములు చెయ్యండి ” అన్నాడు.
కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు. కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు. భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు.
చంద్రుని కాంతి కెరటాలు మీద కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రమును, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యముగా ఉన్నది. Vaalmiki Ramayanam – 64
గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెములా ఉన్నది. పైన ఆకాశములో ఉన్న నక్షత్రాలు సముద్రము మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రము మీద ఎవరో చల్లినట్టు ఉన్నాయి.
ఆకాశము సముద్రములా, సముద్రము ఆకాశములా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడము లేదు. రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి. ఆకాశములో తారలు ఉన్నాయి, సముద్రములో రత్నాలు ఉన్నాయి.
ఆకాశము కదులుతున్న మేఘాలతో ఉన్నది. కదులుతున్న తరంగములతో సముద్రము ఉన్నదని వాల్మీకిమహర్షి తనదైన శైలిలో వర్ణించారు.
ఆ సమయంలో రాముడు సముద్రము వంక చూస్తూ ” సీత లంకలో ఉండిపోయింది. నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది.
అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది ” అన్నాడు.
లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో ” జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా! రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు.
నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకాపట్టణమును ఎంత పీడించాడో మీరు చూసారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉన్నది. రాముడు సముద్రతీరమునకు వచ్చేశాడు.
ఎలాగో అలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరమునకు వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది.
మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయముగా చెప్పినది ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదములు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట మధ్యమమైన మాట.
మంత్రులు విడిపోయి ఎవరిమానన వాళ్ళు తలోమాట చెబితే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి ” అన్నాడు.
మంత్రులు ” ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనని ఓడించి పుష్పక విమానము ఎత్తుకొచ్చారు.
ఆయన ఉన్న ఇంట్లోనుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణము మీదిగా స్వాధీనము చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు.
పాతాళ లోకములోకి వెళ్ళి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు.
యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత? ” అన్నారు.
Vaalmiki Ramayanam -64
Vaalmiki Ramayanam -64
మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి ” రావణా ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున అజాగ్రత్తగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము ” అన్నాడు. Vaalmiki Ramayanam – 64
దుర్ముఖుడనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి ” నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను ” అన్నాడు.
వజ్రదంష్ట్రుడు ” రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు.
వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరికి పంపి ‘ అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు ‘ అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.
ఆ సమయములో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది. అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి ఒక్క నిమిషములో వెళ్ళిపోతాము ” అన్నాడు.
నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు ” దీనికింత మోసం ఎందుకు? నేను వెళ్ళి వాళ్ళని చంపేసి రామలక్ష్మణులని తినేసి వస్తాను ” అన్నాడు.
విభీషణుడు ” మూడు విషయములు ఉన్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్ళడం తేలిక. మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక.
దైవము ప్రతికూలముగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపములు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారు.
రాముడంటే అంత చేతకానివాడిలా కనపడుతున్నాడా ! రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు. దైవము ఆయన పట్ల అనుకూలించి ఉన్నది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు.
నదులకు(తూర్పుదిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) నదులకు భర్త అయిన నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి హనుమ వచ్చి లంకా పట్టణము అంతటినీ కాల్చేశారు.
మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను. నేను చంపేస్తాను.
నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉన్నదా! యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది? అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి.
అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటే వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటే, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో! ఎంతమంది వస్తున్నారో! ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశారా ? Vaalmiki Ramayanam – 64
మీరు ఒక్కసారి ఆలోచించండి రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనములో పెట్టాడు.
రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉన్నది. ధర్మం ఎక్కడ ఉంటే దేవతలు అక్కడ ఉంటారు.
దేవతల అనుగ్రహము రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు? ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి.
లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవము రాకూడదు అనుకుంటే ఏ సీతమ్మ కారణముగా ఇటువంటి కలహం వస్తున్నదో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు.
తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడంము మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి ” అన్నాడు.
విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభనుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు.
విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు. పూజలు, అగ్నికార్యములు జరుగుతున్నాయి.
రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తలవంచి నమస్కరిస్తూ వెళ్ళి ” అన్నయ్యా ! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా! నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను.
ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడము లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను.
నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటినుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడము లేదు. పొగ చుట్టుముట్టి ఉంటున్నది.
అన్ని హోమగుండములలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి.
అన్నిటినీమించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటే, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు.
ఆవుపాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుఱ్ఱములు ఉత్సాహముగా సకిలించడం లేదు. దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి.
గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి.
పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగముల మీద వెంట్రుకలు నిలబడడము లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. Vaalmiki Ramayanam – 64
అరణ్యములో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. కౄరమైన మృగములు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి.  అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పుదాము ” అన్నాడు.
రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి ” ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి. నాకు ఎక్కడా కనపడడము లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు ” అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.
తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు.
రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్నాక ఆయనంటాడు ” నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమ వాస్తవము. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్తా ! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా ” అన్నాడు.
ఆ సభని ఉద్దేశించి రావణుడు అన్నాడు ” మూడులోకములలో సీతకన్నా అందగత్తె లేదు. నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతని చూస్తుంటే నాలో కామ ప్రచోదనం పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను.
ఆ కామం ఎక్కువ అవ్వడం వల్ల నేను నీరసించిపోతున్నాను ( ఆ రావణుడు సీతమ్మ గురించి ఇంకా నీచంగా వర్ణిస్తాడు, అది ఇక్కడ రాయడం బాగుండదని వ్రాయడము లేదు).
నేను సీతని అపహరించి తీసుకొచ్చాక ‘ రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో ఒక సంవత్సర కాలం చూద్దాము ‘ అని సీత నన్ను అడిగింది. ఒక సంవత్సరం వరకూ నా మంచం ఎక్కను అన్నది. పోనిలే ఒక సంవత్సరమే కదా! అని గడువు ఇచ్చాను ” అన్నాడు.
అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు ” నువ్వు చేసిన పని పరమతప్పు. ఇప్పుడు మా అందరినీ పిలిచి, ఏమి చెయ్యను అని అంటావేమిటి? ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసేముందు న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి.
యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తముతో రాజు కాని నిర్ణయం చేస్తే, ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనము పొందుతారు. నువ్వు తొందరపడి సీతని తీసుకొచ్చావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బ్రతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు. ఇంక బెంగపెట్టుకోవద్దు.
హాయిగా లోపలికి వెళ్ళి మధ్యం తాగి, నీ కాంతలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా! నేను వెళ్ళి రామలక్ష్మణులని సంహరించి వానరులందరినీ తినేసి వస్తాను ” అన్నాడు.
మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు ” ఒక కోడిపుంజుకి కోరిక కలిగితే కోడిపెట్టని తరిమి, బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతని అనుభవించు ” అన్నాడు.
రావణుడు ఆ మహాపార్శ్వుడిని దగ్గరికి పిలిచి ” ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. నాకు ఒక శాపము ఉన్నది. ఒకనాడు నేను బ్రహ్మ సభకి వెళుతున్నప్పుడు పుంజకస్థలనే అప్సరస నన్ను చూసి దాక్కుంది.
అప్పుడు నేను ఆమెని వెంట తరిమి, వివస్త్రని చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పి ఉంటుంది. బ్రహ్మగారు నన్ను పిలిచి ‘ ఇకముందు నీయందు మనస్సులేని స్త్రీని నువ్వు బలాత్కారముగా అనుభవిస్తే, ఉత్తరక్షణం నీ శిరస్సు నూరు ముక్కలవుతుందని ‘ శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు ” అన్నాడు.
విభీషణుడు ” మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉన్నది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉన్నది.
ఒక్క విషయం జ్ఞాపకము పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్శ్వుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరెవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు ” అన్నాడు.
ప్రహస్తుడు ” ఏమిటి విభీషణా ! అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకూ తెలియదు. నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు? ” అన్నాడు.
విభీషణుడు ” ఇక్ష్వాకువంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. Vaalmiki Ramayanam – 64
ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామబాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు.
నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటే, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చెయ్యండి, రావణుడి మీద తిరగబడండి. ఆయనకి బుద్ధి చెప్పండి. సీతమ్మని ఇచ్చెయ్యండి. అలా చేస్తే మీరు బ్రతికి ఉంటారు లేకపోతే నశించిపోతారు ” అన్నాడు.
ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి ” వీర్యంలో కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు.
నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రీ ! ‘ రాముడు వచ్చేస్తాడు ‘ అని మాట్లాడుతున్నావు ఎందుకంత భయం నీకు? ఏం చేస్తాడు రాముడు వస్తే ” అన్నాడు.
విభీషణుడు ” నువ్వు బాలుడివి, నీకేమి తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకోచ్చినవాడిని నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు.
ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా! నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకు ఇంద్రజిత్ కుర్చో ” అన్నాడు.
రావణుడు అన్నాడు ” ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండచ్చు. శత్రువని తెలిసి ఆ శత్రువు ఉన్న చోట ఉండచ్చు.
మిత్ర రూపములో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్నవాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరములో ఉండేవి. ఆ ఏనుగులు చెప్పిన మాటలని నీకు చెబుతాను జాగ్రత్తగా విను విభీషణా! ఆ ఏనుగులు అన్నాయి ‘ మనకి అగ్నివల్ల భయం లేదు, పాశముల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి మన జాతి వల్లే భయం ‘ అన్నాయి.
నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తోంది. ఆవులే ఐశ్వర్యము, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయము కలుగుతాయి. నాకు నీవల్లే భయమేస్తున్నది.
ఇవ్వాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి ” అన్నాడు.

Leave a Reply

%d bloggers like this: