Home Sports Daily Horoscope 27/06/2021 :

Daily Horoscope 27/06/2021 :

0

Daily Horoscope 27/06/2021 :

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

27, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 27/06/2021
Daily Horoscope 27/06/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కాలం శుభప్రదంగా ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభాన్ని ఇస్తుంది.

వృషభం

ఈరోజు
స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆందోళనను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం. Daily Horoscope 27/06/2021

మిధునం

ఈరోజు
. బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట పట్టింపులకు పోరాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది

కర్కాటకం

ఈరోజు
ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్ట దైవప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

సింహం

ఈరోజు
.గ్రహబలం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగి శుభఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి.

 కన్య

ఈరోజు
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా కానీయకండి. శివారాధన శుభప్రదం. Daily Horoscope 27/06/2021

తుల

ఈరోజు
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.

వృశ్చికం

ఈరోజు
ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. శని ధ్యానం మంచినిస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి అవుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదవండి.

మకరం

ఈరోజు
మేలైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. విందు,వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. దుర్గా ఆరాధన చేయాలి.

కుంభం

ఈరోజు
అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మంచి మనస్సుతో ముందుకు సాగండి. కష్టాలు తగ్గుతాయి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. Daily Horoscope 27/06/2021

మీనం

ఈరోజు
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. మనస్సౌఖ్యం ఉంటుంది. లక్ష్మీధ్యానం చేయాలి

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, జూన్ 27, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిధి:తదియ రా7.00తదుపరి చవితి
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ5.40 తదుపరి శ్రవణం తె5.03
యోగం:వైధృతి రా8.13 తదుపరి విష్కంభం
కరణం:వణిజ ఉ7.46 తదుపరి విష్ఠి రా7.00 ఆ తదుపరి బవ
వర్జ్యం: ఉ9.33 – 11.07
దుర్ముహూర్తం: సా4.49 – 5.41
అమృతకాలం:సా6.54 – 8.28
రాహుకాలం: సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మిథునం ||
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.31 || సూర్యాస్తమయం:6.34 Daily Horoscope 27/06/2021

Leave a Reply

%d bloggers like this: