Daily Horoscope 25/06/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
25, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము భృగు వాసరే
( శుక్ర వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.
వృషభం
ఈరోజు మిశ్రమ కాలం. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. Daily Horoscope 25/06/2021
మిధునం
ఈరోజు
బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్ట దైవారాధన మంచి ఫలితాన్నిస్తుంది.
కర్కాటకం
ఈరోజు
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన మేలు.
సింహం
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కన్య
ఈరోజు
శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా.. ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.
తుల
ఈరోజు
మేలైన ఫలితాలున్నాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది. Daily Horoscope 25/06/2021
వృశ్చికం
ఈరోజు మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం.
ధనుస్సు
ఈరోజు ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీ దేవిని సందర్శిస్తే మంచిది.
మకరం
ఈరోజు
ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకుపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరుడిని ఆరాధించాలి
కుంభం
ఈరోజు
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి.ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
మీనం
ఈరోజు
మొదలుపెట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది. Daily Horoscope 25/06/2021
Panchangam
శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, జూన్ 25, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి రా10.26 తదుపరి విదియ
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:మూల ఉ7.51
తదుపరి పూర్వాషాఢ
యోగం:బ్రహ్మం రా1.00 తదుపరి ఐంద్రం
కరణం:బాలువ ఉ11.29 తదుపరి కౌలువ రా10.26 ఆ తదుపరి తైతుల
వర్జ్యం:ఉ6.21 – 7.51 &
సా4.56 – 6.27
దుర్ముహూర్తం:ఉ8.07 – 8.59 & మ12.28 – 1.20
అమృతకాలం:రా2.01 – 3.32
రాహుకాలం :ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.31
సూర్యాస్తమయం:6.34 Daily Horoscope 25/06/2021