Daily Horoscope 24/06/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
24, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము బృహస్పతి వాసరే
( గురు వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో చంచల బుద్ధితో వ్యవహరిస్తారు. Daily Horoscope 24/06/2021
ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
వృషభం
కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఇష్ట దైవారాధన మేలు.
మిధునం
కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు కార్యచరణలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.
కర్కాటకం
మనసుకు ఉల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా లాభపడతారు.
శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
సింహం
బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం కొరకు
దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.
కన్య
అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. Daily Horoscope 24/06/2021
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
తుల
మీ మీ రంగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది.
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
వృశ్చికం
మిశ్రమ ఫలితాలున్నాయి. వివాదానికి దూరంగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు.
ఇష్ట దైవారాధన మేలు.
ధనుస్సు
మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ సోత్రం పఠించాలి.
మకరం
అవసరానికి సహాయం చేసేవారున్నారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రం పఠించాలి.
కుంభం
మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం. Daily Horoscope 24/06/2021
మీనం
కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అభివృద్ధికై తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ శ్రేయోదాయకం.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
గురువారం, జూన్ 24, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి రా12.37 తదుపరి బహుళ పాడ్యమి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ ఉ9.24 తదుపరి మూల
యోగం:శుభం ఉ6.40 తదుపరి శుక్లం తె3.41
కరణం:విష్ఠి మ1.42
తదుపరి బవ రా12.37 ఆ తదుపరి బాలువ
వర్జ్యం: సా4.48 – 6.19
దుర్ముహూర్తం:ఉ9.48 – 10.39 &
మ2.57 – 3.49
అమృతకాలం:రా1.49 – 3.19
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.33 Daily Horoscope 24/06/2021