Home Uncategorized Sports The Divine History of Sri Venkateswara

The Divine History of Sri Venkateswara

0
The Divine History of Sri Venkateswara
Divine History of Sri Venkateswara - 38

The Divine History of Sri Venkateswara – పద్మావతి తన యిష్టసఖులను వెంటబెట్టుకొని శృంగారవనమునకు విహారమునకై వెళ్ళినది. అందమయిన అనేకానేక రకాల మొక్కలు, వివిధ నామాలతో విలసిల్లే పుష్పాలూ తో ఆ శృంగారవనము శోభాయమానముగా వుంది.

చెలులు తోటపని చేసి, ఆ తరువాత కొలనులో చల్ల చల్లని నీటిలో జలకాలాడారు. ఆ తరువాత మధుర ఫలాలు భక్షించారు. ఆనందముగా సంగీతయుక్తముగా పాటలు పాడుకోవడము ప్రారంభించారు.

దాహముతో నున్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనములో గల కొలనులో నీరు త్రాగి, దాహము తీర్చుకొని ఒక వృక్షచ్చాయకు వెడలినాడు. అప్పుడతనికి పద్మావతి చెలికత్తెలు చేస్తున్న గానము వినబడింది. ఆ గానం వింటూ శ్రీనివాసుడు ఆ పాటలు పాడుతున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. The Divine History of Sri Venkateswara

పాట వచ్చేవైపే వెళ్ళినాడు. పద్మావతిని, చెలికత్తెలను చూశాడు, వారూ శ్రీనివాసుని చూశారు.

పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసు డాశ్చర్యపోయినాడు. ఆహా! ఈ కన్య రతిని, పార్వతిని, భారతిని, శ్రీసతిని తలదన్నునంత అందముగ నున్నదే! ఈ వనితపొందు పొందనిచో నా యీ జన్మమేల?

ఈమె పాదాలు చూడబోతే చిగురుటాకుల్ని మించి వున్నాయి. ఈమె నడుము చూస్తే లేదనిపించే నడుము. ఈమె వక్షోజాలు చూస్తే జక్కువపిట్టలకన్నా బాగున్నాయి. చేతులు కమలాల సుకుమారాన్ని కాదనేలా ఉన్నాయి.

శంఖములాగా ఉన్నది కంఠము. అధరము దొండపండులాగా ఉన్నది. మల్లె మొగ్గలను మించిన తెల్లదనముతో పలువరుస వున్నది. నువ్వుల పువ్వు లను నీలెక్కే మిటనగల సొగసుతనము గల ముక్కు ఈమె కున్నది.

శ్రీకారములను మించిన చెవులు కలిగి యున్నదీ వనిత, ఆమె కన్నులా హృదయగతానం దావిష్కారణ దర్పణములై నిర్మలములై ఉన్నవి. ఈమె తీయని మాటలు వీణియమీటల మధురస్వరములను మించి ఉన్నవి’ అని పద్మావతి సౌందర్యాన్ని పదేపదే వర్ణించుకున్నాడు.

అసలు ఈమె వివాహితయో? అవివాహితయో? కూడా తెలుసుకొనవలసి వున్నది, సరే ఆమెనే అడిగెదను గాక అనుకొని పద్మావతినీ సమీపించబోయెను.

పద్మావతి తన చెంతకు వచ్చుచున్న వేటగానిని చూచి బెదిరి చెలులతో ‘‘మీరు వెడలి ఆ వచ్చుచున్న పురుషులెవరో సంగతీ సందర్భము తెలుసుకొనిరండి’’ అని చెలులను పంపించినది. The Divine History of Sri Venkateswara

చెలెకత్తెలు శ్రీనివాసుని సమీపానికి వెడలి ‘‘అయ్యా మీరెవరో తెలుసుకొనగోరుచున్నాము. మీ నామధేయమేమి? మీరు యిచ్చటికి యెందు వచ్చిరి మార్గము తప్పి వచ్చితిరా! ఈ శృంగారవనానికి పురుషులు రాకూడదని మీకు తెలియదా!’ అని ప్రశ్నించిరి.

అంతట శ్రీనివాసుడు ‘‘కన్యలారా! మీరు వేసిన ప్రశ్నలన్నింటికి మీ రాజకుమార్తెకు స్వయముగా సమాధాన మివ్వగలవాడను’’ అని అంటూ పద్మావతిని సమీపించినాడు.

శ్రీనివాసుడు వేటకు వెళ్ళేదారి వేషం ధరించియున్నందువలన అతడు నిజముగా బోయవాడనియే పద్మావతి భ్రమించినది, కోపములో ఆమె మీరీవిధముగా స్ర్తీలుండే వనానికి రావడము సబబా? మీ దేశము యే దేశము?’ అని శ్రీనివాసునిపైప్రశ్నల వర్షం కురిపించినది.

శ్రీనివాసుడన్నాడు గదా ‘‘ఓ సుందరీ! నాకెవరూ లేరు. ప్రస్తుతము నాకు బంధువులునూ లేరు. చెప్పుకొనుటకు నివాసమునూ లేదు.

పూర్వము నాకు నివాస మొకటి వుండేది. ఇప్పుడు సంచారినగుటచే సర్వదేశములున్నూ నావే, పూర్వకాలములో లక్ష్మీ సంపన్నుడిగా నుండిననూ ప్రస్తుతము నేను బీదవాడను, నీవెవ్వరివి? నీ శుభనామమేమి? నీ మాతాపితలెవ్వరు? అని అడిగినాడు.

జవాబు యివ్వకపోవుట మర్యాద కాదనీ ఆమెకు తెలుసు. అందుచే ‘నా తండ్రి ఆకాశరాజు, నా తల్లి ధరణీదేవి, నా పేరేమో పద్మావతి’ అని చెప్పి. మీరిచ్చటనుండి త్వరగా వెళ్ళుడు. పురుషులు యీ ప్రాంతమున నుండరాదనెను.

అందులకు శ్రీనివాసుడు ‘సుందరీ’! నీ చక్కదనము చూచిన క్షణమునుండి యిచ్చటనుండి మరలి వెడలుటకు నా మనస్సు ఒప్పుకొనుటలేదు. నీవు లక్ష్మివలె నున్నావు. నిన్ను నేను ప్రేమించుచున్నాను. The Divine History of Sri Venkateswara

నన్ను వివాహము చేసుకొనుము’ అన్నాడు. ఒడలు మండిపోయినది పద్మావతికి ‘‘ఓయీ! మూర్ఘ స్వభావుడా! క్రిందు మీదెరుగకు పలుకుచున్నావు.

క్రూర స్వభావుడవైన, బోయవాడవైన నిన్ను నేను వివాహము చేసుకొనవలెనా? నీవు మతిభ్రమవలన యీ విధముగా మాట్లాడుచుంటివా? మా తండ్రిగారైన ఆకాశరాజుగారికి యీ విషయము తెలిస్తే యింకేమయినా వుంటుందా? నిన్ను ఖండఖండాలుగా చేస్తారు తెలుసా! లెంపలు వేసుకొని యింటికి వెళ్ళిపో’ అని గర్జించింది.

శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందులాడుచుండగా ‘‘ప్రేమకు ఆశాశ్వతమైన సంపదలతో సంబంధము వుండదు. ప్రేమ హృదయాలకు సంబంధించినది.

The Divine History of Sri Venkateswara
The Divine History of Sri Venkateswara

అది మమత, అనురాగము, అభిమానము మున్నగువానితో ముడివేసుకొని వుంటుంది. నిన్ను వివాహము చేసుకోకపోతే నేను జీవించలేను. నన్ను కాదనకు!’ అని కొంచెము దర్జాగా వెళ్ళాడు . ఇక వూరుకొని లాభము లేదనుకొన్నది పద్మావతి.

వెంటనే చెలులను పిలచి ‘మీద మీదకు వస్తున్న ఈయనను రాళ్ళతో కొట్టండి’ అన్నది. ఆ చెలికత్తెలందరూ రాళ్ళు తీసుకొని శ్రీనివాసుని కొట్టసాగారు. అందరూ ఒక్కసారిగా కొట్టిన ఆ రాళ్ళ దెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకొనలేకపోయాడు.

శరీరమంతా రాళ్ళ దెబ్బలవలన రక్తము కారుచుండగా, శృంగారవనమునుండి శ్రీనివాసుడు నిష్క్రమించి, తన నివాస స్థానమగు శేషాచలము చేరుకున్నాడు.

శ్రీనివాసుడు. విచారముతో. దిగులుపడి రావడానికి కారణము తెలియక గాభరా పండింది వకుళ, తీరాచూస్తే శరీరము నిండా గాయాలూ, రక్తమూను, మహాందోళన పడినది,

‘అయ్యో! నాయనా! ఇదేమిటి? ఇన్నిగాయాలేమిటి? ఈ రక్తమేమిటి? నిన్ను కొట్టిన ఆ కరకు గుండెలవాళ్ళెవరు? అయ్యయ్యో! ఎట్లా ఓర్చుకుంటున్నావో నాయనా! నీ తల్లిని నేను అడుగుతున్నాను.

ఏమి జరిగినది? విషయము చెప్పు నాయనా! అని అడిగినది. అడుగుతూనే గాయములపై ఏవేవో పసరులూ, ఆకులూ తెచ్చి వేసినది. ఒడలు తడిమి గాయమున్న చోటనల్లా ఆకుపసరు రాసినది.

శ్రీనివాసుడు వకుళతో జరిగిన విషయములను పూజగ్రుచ్చినట్లు చెప్పాడు. శ్రీనివాసుడు ‘అమ్మా! అదేమిటోనమ్మా! ఆ సౌందర్యరాశిని చూసినప్పటినుండి పెండ్లి చేసుకొంటే ఆమెనే చేసుకోవాలని భ్రాంతి కలిగినది. ఆమె లేకపోతే నేను బ్రతకలేను. ఆమెను వివాహమాడకపోతే యిక నా జీవితమే లేదు’ అని తన హృదయములో నున్నదంతా వెళ్ళగ్రక్కాడు..

శ్రీనివాసుడు చెప్పినది సర్వమూ వినిన వకుళ అతనితో ‘నాయనా! ఎంతటి పొరపాటు చేసితివి? ఆకాశరాజు అంటే సామాన్యుడా! సిరిసంపదలతో తులతూగే మహారాజు, అతనికీ మనకీ వియ్యము ఎలా పొసగుతుంది? The Divine History of Sri Venkateswara

కయ్యమైనా, వియ్యమైనా సమానమైన వాళ్ళతోనే మంచిదను పెద్దల మాటలు వినలేదా? నీ మేలుకోరి చెప్పుచున్నాను. ఇక ఆ విషయము మరచిపో, వారితో మనకేమి సంబంధం?’’ అన్నది.

ఏకస్వరూప గోవిందా, లోక రక్షక గోవిందా, వేంగమాంబనుత గోవిందా, వేదాచల స్థిత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||20||

శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-21

శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందిస్తూ ‘‘మాతా! ఈనాడు నీకొక రహస్యము చెప్పగలవాడను వినుము. పూర్వకాలములో నేను శ్రీరామావతారము ధరించినప్పుడు నేను లేని సమయము చూసి, రావణుడు సీతను యెత్తుకుపోయాడు.

మార్గ మధ్యములో అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడినాడట.

అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి, ఆశ్రమమున మాయ సీతను వుంచితిననియూ, అతడు తీసుకుపోతున్న సీత మాయసీతే ననియు నమ్మించాడు. మాయసీత నాకేలనని రావణుడు అగ్నిదేవునకిచ్చి వేసినాడు.

‘అసలు సీత యిదిగో ఈమె’ యని చెప్పి, తనవద్దనున్న వేదవతిని రావణున కిచ్చినాడట.

నాకు యీ విషయము తెలియదు, రావణుని నేను సంహరించిన అనంతరం సీతను ఒకవేళ లోకము శంకిస్తుందేమో యని అగ్నిప్రవేశము చేయించాను.

అప్పుడు అగ్నిదేవుడు వచ్చి విషయము చెప్పి వేదవతినీ కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసినదని కోరాడు. అప్పుడతనితో నేను వేదవతిని కలియుగములో వివాహమాడెదనని మాట నిచ్చివేయుటము జరిగినది.

ఆ వేదవతియే యీ పద్మావతి. కనుకనే పద్మావతిని నేను వివాహమాడవలసి యున్నది. అన్ని వకుళతో వివరముగా చెప్పినాడు.

శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులోమెదలడము ప్రారంభించినాయి. The Divine History of Sri Venkateswara

కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు. అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది.

అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది.

‘బోయవాడు, బికారివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించుకోవడము మానినది.

వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది.

పద్మావతి మనోవ్యాధితో మంచమెక్కినది, ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు. రాజవైద్యులు కూడా వైద్యము చేశారు.

ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది.

ఇక్కడ పద్మావతియిలా వుంటే
అక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.

శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది.

శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను.

శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. The Divine History of Sri Venkateswara

పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.

Leave a Reply

%d bloggers like this: