Home Sports Daily Horoscope 23/06/2021

Daily Horoscope 23/06/2021

0

Daily Horoscope 23/06/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

23, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 23/06/2021
Daily Horoscope 23/06/2021

రాశి ఫలాలు

మేషం

కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. Daily Horoscope 23/06/2021

 వృషభం

మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మిధునం

మనస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం

కర్కాటకం

కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం

.చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

కన్య

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

తుల

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 23/06/2021

వృశ్చికం

కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మధుర క్షణాలను పొందుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. మనోబలం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బంధుసహకారం ఉంటుంది. శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఒక శుభవార్త మీ ఇంట్లొ సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవత స్తోత్రం చదివితే బాగుంటుంది

కుంభం

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

 మీనం

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి సహాయం అందుతుంది. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది. Daily Horoscope 23/06/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జూన్ 23, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్థశి రా2.53 తదుపరి పౌర్ణమి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:అనూరాధ ఉ10.58తదుపరి జ్యేష్ఠ
యోగం:సాధ్యం ఉ9.38 తదుపరి శుభం
కరణం:గరజి సా4.16 తదుపరి వణిజ రా2.53 ఆ తదుపరి విష్ఠి
వర్జ్యం:సా4.12 – 5.41
దుర్ముహూర్తం:ఉ11.48 – 12.39
అమృతకాలం:రా1.10 – 2.40
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.33

Leave a Reply

%d bloggers like this: