Home Bhakthi Divine History of Sri Venkateswara

Divine History of Sri Venkateswara

0
Divine History of Sri Venkateswara
Divine History of Sri Venkateswara - 54

Divine History of Sri Venkateswara – ఒక రోజున ఆకాశరాజు సభకి నారదులవారు రాగా, రాజా మునిని పూజించి వారి ఆశీర్వాదం పొంది, పద్మావతికి తగిన వరునకై తాను చేస్తున్న అన్వేషణ గూర్చి చెప్పి ‘‘స్వామీ నారదమునీ! మీరు మూడులోకాలూ సంచరిస్తూంటారు కదా! ఎక్కడైనా మా అమ్మాయి పద్మావతికి తగిన సంబంధము చూద్దురూ. మీరు తలుచుకుంటే జరగని పని అంటూ వుండదుకదా’’ అన్నాడు.

నారద మహర్షి ఆకాశ రాజు కు భృగు మహర్షి వృత్తాంతము, లక్ష్మి దేవి వైకుంఠము వెడలుట, ఆమెను వెదుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకమున కు వచ్చిన విధానం తెలిపి ఇంకా ఆ వివరాలు ఈ విధంగా తెలిపారు

శ్రీనివాసుడు లక్ష్మీదేవి కొల్హాపురం నందు ఉన్నదని తెలుసుకుని అక్కడికి చేరగా ఆమె అక్కడి నుండి అంతర్ధానమై తిరుమల కొండలలో కల కపిల మహర్షి ఆశ్రమమునకు చేరినది Divine History of Sri Venkateswara

శ్రీనివాసుడు మరల తీవ్ర మనోవేదనతో ఆశ్రమమునకు చేరగా ఆమె అక్కడి నుండి కూడా అదృశ్యమై పాతాళానికి వెళ్ళినది

లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి కపిల మహర్షి సూచనతో తిరుచానూరు పద్మసరోవరము చెంత సూర్య భగవానుని సాక్షిగా చేసుకొని లక్ష్మీదేవి కొరకై 12 సంవత్సరములు తపస్సు చేయగా, పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై
స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది.

కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ.

తమిళంలో “అలర్” అనగా పువ్వు. “మేల్” అనగా పైన. “మంగై” అనగా అందమైన స్త్రీ – “అలమేలు” అనగా “పద్మంలో ప్రకాశించున సుందరి”

ఆమె మేని కాంతికి సూర్య కిరణాల కాంతి కూడా చిన్న పోయినది

ఆ అతిలోక సౌందర్యమును కాంచిన జగత్తు పులకించినది పిదప శ్రీనివాసుని మనో రథమును తీర్చుటకై మరియు శాప వశమున భువిలో జన్మించిన నిన్ను ఉద్ధరించుట కై జగన్నాటక సూత్రధారి లీలా విశేషాలతో యజ్ఞ ఫలము గా పసిపాప రూపములో నీకు దొరికినది Divine History of Sri Venkateswara

Divine History of Sri Venkateswara
Divine History of Sri Venkateswara

ఆమే వేదమాత
ఆమే మహా లక్ష్మి
ఆమే వేదవతి .
ఆమే లోకమాత
ఆమే
శ్రీనివాస హృదయేశ్వరి.

ఆమెను వివాహము చేసుకొనుటకు అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువునకే వున్నది. ఈమెను శ్రీమహావిష్ణువు పెండ్లాడును, నమ్ముము.

ఆ శ్రీమహావిష్ణువు నీ కుమార్తెను వివాహమాడే ముహూర్తము త్వరలోనే వున్నది. ఇంక యీ విషయములో బెంగలేకుండా నిశ్చయంగా వుండు అంతా సవ్యంగా జరుగుతుంది’’ అని నారదుడు వెళ్ళిపోయాడు.

శ్రీవేంకటేశ్వరదివ్య_చరిత్ర-19

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తనకు అల్లుడవుతాడని చెప్పగానే ఆకాశరాజు హృదయములో ఆశ్చర్యము, సంతోషము ఒకదానిని మించి మరొకటి చోటుచేసుకొన్నాయి.

వామనరూపములో శ్రీమహావిష్ణువుకు మూడు అడుగుల స్థలము దానము చేస్తూ, తాను శ్రీమహావిష్ణువుకు దానము చేయగలిగిన అదృష్ట వంతుడనని బలిచక్రవర్తి ఆనందించాడు.

అదే విధముగా ఆకాశరాజు తాను శ్రీమహావిష్ణువునకు కన్యాదానము చేయడము జరగబోతుందని ఆనందించాడు. అంతకన్నా తనకు కావలసిన అదృష్టము లేదను కున్నాడు.

సభానంతరము ధరణీదేవిగారికీ విషయము చెప్పాడు. ఆమె ఆనందానికిఅడ్డూ ఆపూ లేదు.

ఒకనాడు శ్రీనివాసునకు ఒక కోరిక పుట్టినది. అదేమిటంటే అడవిలోనికి వెళ్ళి వేటాడలని తన మనోభిష్టాన్ని వకుళాదేవికి తెలిపినాడు. శ్రీనివాసుని కోరికకు తెల్లబోయింది.

వకుళాదేవి ‘నాయనా! సుకుమారమైన శరీరము కలవాడవు. నీవు వేటాడతావా? వరాహవ్యాళ, శార్దూల, ఖడ్గ, మత్తేభాది క్రూరమృగాలు తిరుగాడే అడవులందు వాటితో చెలగాటము మనకు వలదు నాయనా!’’ అన్నదామె. Divine History of Sri Venkateswara

శ్రీనివాసుడు ‘‘అమ్మా! అనవసరంగా భయపడకమ్మా, ఎన్ని క్రూరమృగాలున్ననూ నన్నేమీ చేయజాలవు. నీ పుత్రుడంటే భీరువు కాదమ్మా. నేను జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను కదా’’ అన్నాడు. సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా!’’ అనీ ఆశీర్వదించి పంపినది వకుళ.

శ్రీనివాసుడు వేటకు సంసిద్దమయ్యాడు. వేటకు వెళ్ళేటప్పుడు కట్టుకొనే బట్టలు కట్టుకున్నాడు. ముత్యాలు అమరించిన కుచ్చులు తీర్చిన దట్టిని మొలకు కట్టుకున్నాడు సంపంగినూనె రాసుకొని చక్కగా దువ్వుకున్నాడు.

సరిగంచు వల్లెవాటు వేసికొన్నాడు. అనేకరకాల ఆభరణాలు పెట్టుకున్నాడు. పరిమళం వెదజల్లే గంధాలు శరీరానికి రాసుకున్నాడు. కస్తూరీ తిలకము నుదుట పెట్టుకున్నాడు. కర్పూర మిళిత తాంబూలము వేసుకున్నాడు.

విల్లంబులు ధరియించి వేటకు యింక వెళ్ళిపోదామనుకుంటుంటే, బ్రహ్మదేవుడు యీ విషయము గ్రహించి ఒక గుఱ్ఱాన్ని స్పష్టంచి శ్రీనివాసుడుండే చోటికి పంపాడు. దానిపై యెక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు.

అరణ్యము సమీపించి ధనుష్టంకారము అడవిలో గల సింహం, శార్దూల, చామరీ, సారంగ, భల్లూకాది జంతువులు భయపడి చెల్లాచెదురై తమ చోట్లు వదిలి వూరకే తిరగసాగాయి. Divine History of Sri Venkateswara

వేటాడటానికి అదే సమయమనుకున్నాడు శ్రీనివాసుడు. విజృంభించాడు. పదునుతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాల్ని చెండాడసాగాడు. పులుల తలలు నరకసాగాడు. ఏనుగుల్ని నేలమట్టము చేశాడు. లేళ్ళను చాలా చంపినాడు. అడవిపందుల్ని హతమార్చినాడు.

ఇక్కడనుండిఅక్కడకు, అక్కడనుండి మరొకచోటికి తన గుఱ్ఱముపై విహరిస్తూ శౌర్యోత్సాహాలతో వేటాడసాగాడు,

అంతలో ఒక పెద్ద ఏనుగు మహా ఘీంకారము చేసుకొంటూనే ఎటో వెళ్ళిపోయినది.

ఆ ధ్వనిని బట్టి వెడలి శ్రీనివాసుడు దానిని తరుమసాగాడు, అది కూడా చాలా వేగముగా వెళ్ళడము ప్రారంభించింది. శ్రీనివాసుడున్నూ మఱింత వేగముతో వెంబడించాడు. కాని ఫలితము లేకపోయినది. అది చివరకు అయిపూ లేకుండా పారిపోయినది.

శ్రీనివాసుడు ఆ మహాగజము కారణముగా చాలా అలసట పడినాడు. దాహము కూడా వేసింది. నీటిని గూర్చి చెంతనున్న ఉద్యానవనముకి వెళ్ళినాడు. ఆ వనము పేరు శృంగారవనము.

Leave a Reply

%d bloggers like this: