
Daily Horoscope 20/06/2021
శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
20, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము భాను వాసరే
( ఆది వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
రాశి ఫలాలు
మేషం
తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం.
వృషభం
తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. Daily Horoscope 20/06/2021
శివ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.
మిధునం
కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈ వారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
ఒక మంచివార్తను వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
దైవారాధన మానవద్దు.
సింహం
అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
కన్య
కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే మంచిది.
తుల
మిశ్రమకాలం. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే మంచి జరుగుతుంది.
వృశ్చికం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి.
శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు
శ్రమకుతగిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
మకరం
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను మొదలుపెట్టడానికి సరైన సమయం. కొన్ని సంఘటనలు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీ దేవిని సందర్శించడం మంచిది. Daily Horoscope 20/06/2021
కుంభం
శుభఫలితాలున్నాయి. కాలం సహకరిస్తుంది. మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
మీనం
బుద్ధిబలంతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గాదేవిని సందర్శించడం వలన మేలు జరుగుతుంది.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, జూన్ 20, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిధి:దశమి మ12.31 తదుపరి ఏకాదశి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:చిత్ర మ3.47 తదుపరి స్వాతి
యోగం:పరిఘము సా6.39తదుపరి శివం
కరణం:గరజి మ12.31 తదుపరి వణిఙ రా11.23 ఆ తదుపరి భద్ర
వర్జ్యం: రా9.05 – 10.34
దుర్ముహూర్తం :సా4.47 – 5.39
అమృతకాలం:ఉ9.44 – 11.14
రాహుకాలం: సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.30
సూర్యాస్తమయం:6.32 Daily Horoscope 20/06/2021