Home Bhakthi The Divine History of Sri Venkateswara

The Divine History of Sri Venkateswara

0
The Divine History of Sri Venkateswara
Sri venkateswara Divyacharitra-36

The Divine History of Sri Venkateswara  : శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-12 -చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు.

చోళరాజు భార్య వాని పై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి!

ఒక్కరోజయినా నీవు పాలు సరిగా పితికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు. నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది.

నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.

ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు

‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను. The Divine History of Sri Venkateswara

ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.

రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును.

ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది. మందలించుటయేమి – హెచ్చరించినది,

‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడ’’నన్నాడు వినయముగా గోపాలుడు.

రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది.

ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు.

ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది.

ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. The Divine History of Sri Venkateswara

పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.

కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా!

అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు.

తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.

The Divine History of Sri Venkateswara
The Divine History of Sri Venkateswara

ఆయన తల పై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేల పైబడి మూర్చపోయినాడు

ఓం నమో వేంకటేశాయ!!

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-13

అంతట ఆవు అంబా, అంబాయని అరుచుకొనుచు కన్నుల వెంబడి నీరుకారుచుండగ పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళ్ళెను. ఎన్నడూ పొందని ఆశ్చర్యము పొందినాడు రాజు.

వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొన నిశ్చయించినాడు.

మహాశ్చర్యభరిత ఆలోచనా సమన్విత హృదయుడై ఆ రాజు తాను స్వయముగా ఆ ఆవు ననుసరించి పర్వతాన్ని అధిరోహించి పుట్ట చెంతకు చేరాడు.

పుట్ట నుండి రక్తము వచ్చుట ఎట్టు జరుగుచున్నది?

గోపాలుడు మూర్చబోవడానికి కారణము ఏమిటి? అనే ఆలోచనలు అతని మెదడులో తిరుగాడసాగాయి! ఇంతలో…

ఇంతలో ఏమి జరిగినదీ అంటే గాయమూ, రక్తమూ కలిగిన తలతో శ్రీమహావిష్ణువే పుట్టవెలుపలికి వచ్చేశాడు. వచ్చి, చోళరాజును జూచినవాడై ఆగ్రహముతో

‘‘ఓరీ! మదాంధా! నీచరాజా! నీకు కళ్ళు ఎంతగా మూసుకొనిపోయినవి? లేకున్న నీకు ఏ యెగ్గూ తలపెట్టని నన్ను నీ గోపాలుని చేత గండ్రగొడ్డలితో కొట్టించుటకు సాహసించి యుందువా!

నా కోపమునకు, నా బాధకు నీవు కారణమైతివి గనుక, ఇదిగో శపించుచున్నాను, ఆ తప్పు ని కాదు. ఆ గోపాలునిదే అనగలవేమో! సేవకుల దోషములకు యజమానులకు దండన వుండి తీరును, అందువలన నీవు పిశాచమయిపోయెదవు గాక!’’ యని శపించెను. The Divine History of Sri Venkateswara

భరించలేని పిశాచరూపము పొందునట్లు స్వామి తీవ్రకోపముతో శపించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయెను. అతడు స్వామి పవిత్ర పాదముల పై కుప్పగా కూలిపోయాడు. విలపించడం ప్రారంభించాడు.

‘‘ఓ స్వామీ! పవిత్రమూర్తీ నేను ఏ పాపమున్నూ యెరుగను. గోపాలుని గండ్ర గొడ్డలితో నిన్ను కొట్టమని నేను అసలు యాజ్ఞపించలేదు

స్వామీ! నిజముస్వామీ నమ్ము స్వామీ! నన్ను పిశాచముగా మారిపోవుట యెందులకు మీరు శపించినారు. ఎంత ఘోరమయిన శాపమిచ్చినారు?

స్వామీ! ’’అసలు మీరీ పుట్టలో నున్నట్లు నాకు తెలియనే తెలియదు. రక్షించు స్వామీ! అని అతిదీనముగా విలపించసాగినాడు.

భగవానుడు కరుణామయుడు, ప్రేమహృదయుడు కదా! చోళరాజకృత ప్రార్ధనకు కరిగిపోయాడు.

ఆలోచించి చోళరాజుతో ‘‘ఓ రాజా యేదియేమైనను నా శాపము వ్యర్థమగుట జరుగని పని, కాని, నీవు యీ శరీరము వదలిన వెనుక తిరిగి చోళవంశములోనే పుడతావు.

అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా వుంటుంది. నీకు ఒక కుమార్తె కలుగగలదు. ఆమె పద్మావతి నామముతో విలసిల్లుతుంది.

యుక్తవయస్సు వచ్చిన వెనుక నీ కుమార్తె అయిన పద్మావతిని నాకిచ్చి వివాహము చేయుట జరుగును.

వివాహ శుభసయములో నీవు అందమయిన వజ్రకిరీటాన్ని నాకు బహూకరిస్తావు.

శుక్రవారం నాడు మాత్రమే నేను దానిని ధరిస్తుంటాను. ఆ శుక్రవారము రోజుతోనే నీకు పిశాచరూపము పోతుంది’’ అన్నాడు.

గోపాలునికి అంధత్వము ఎప్పుడు పోతుంది?

మూర్ఛబోయిన గోపాలుడు మూర్ఛనుండి తేరుకొన్నాడు. అతడు అంధుడయి పోయినాడు. వాడున్నూ శ్రీమన్నారాయణుని పవిత్రపాద పద్మముల పైబడి ‘‘స్వామీ! అంధుడయిన నాకు త్రోవ చూపుటకు ఆధారము నీవు కావా? నన్ను రక్షించవా? స్వామీ!’’ అని దీనాతిదీనముగా వేడుకొనెను.

ఎవ్వరి దుఃఖాన్నీ చూడలేనివాడు కదా స్వామీ!’’ అనుగ్రహ వాక్యాలు ఈ విధంగా పలికాడు ‘‘ఓరీ కొన్ని రోజులు గడిచిన పిదప ఇదుగో ఈ పర్వతము మీదనే నేను వెలయుట జరుగను. The Divine History of Sri Venkateswara

నీవు అప్పటి వరకు మాత్రము అంధుడవయి యుండవలెను. అది తప్పదు. అప్పటి నా అవతారదర్శనమాత్రముననే నీకు అంధత్వము పోవును’’ అని శ్రీమహావిష్ణువు అచ్చట నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు.

Leave a Reply

%d bloggers like this: